Advertisement
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందిస్తారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 03 నుంచి పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు.
Advertisement
Advertisement
కేంద్రం తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం.. తెలంగాణ పట్ల అనుసరించిన కక్ష్య పూరిత చర్యలు, తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో కొంత ఆలస్యం అయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తొలి విడుతలో మిగిలిన రూ.19వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని.. సెప్టెంబర్ రెండోవారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడుతల వారిగా కొనసాగించాలని సూచించారు.