Advertisement
మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నిహారిక కొణిదల విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మీద ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా నిహారిక కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నిహారిక యువ నటుడు తరుణ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త వైరల్ అయిన తర్వాత తరుణ్ చేసేది ఏమి లేక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Advertisement
Advertisement
ప్రస్తుతం తరుణ్ సినిమాలు ఏమీ చేయడం లేదు. ఎందుకంటే తనకి నచ్చిన కథ అయితే దొరకడం లేదు అని సినిమాలకి దూరం అయిపోయాడు. అయితే ఎప్పటికప్పుడు పెళ్లి గురించి మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. తరుణ్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రచారం గురించి మాట్లాడుతూ తరుణ్ ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా నేను చెప్తానని పెళ్లి విషయంలో ఎందుకు పుకార్లు పుట్టుకొస్తున్నాయో నాకు తెలియదని తరుణ్ చెప్పారు.
Also read: