Advertisement
టమాటా ధర ప్రస్తుతం మోత మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి ప్రథమ పౌరుడి వరకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇంట్లోని వంటగది నుంచే కాదు.. గవర్నర్ కిచెన్ మెనూ నుంచి కూడా మాయమైంది. ఇది వాస్తవం అండి.. రోజు రోజుకు టమాటా ధర పెరుగుతుండటంతో విసిగిపోయిన ఆ రాష్ట్ర గవర్నర్ తమ ఫుడ్ మెనూ సైతం మార్చుకున్నాడు. అంత ధరకు కొనేది లేదని తేల్చేసారు. మెనూ నుంచి టమాటాలు తొలగించబడ్డాయి.
Advertisement
Advertisement
పంజాబ్ లో కిలో టమాటా ధర రూ.200 కి చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో టమాటాల స్థానంలో ఇతర ఆహార పదార్థాలను తాత్కాలికంగా భర్తీ చేయాలని అక్కడి గవర్నర్ ప్రజలను కోరారు. అలా చేయడం వల్ల వాటికి పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. రాజ్ భవన్ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం.. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. చండీఘడ్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నారు. పెరుగుతున్న ఆహార ధరల ప్రభావాలను అనుభవిస్తున్న పంజాబ్ నివాసితులకు మద్దతుగా టమాట వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు.
సాధారణంగా ఒక వస్తువు వినియోగాన్ని నిలిపివేస్తే లేదా తగ్గించడం ద్వారా దాని ధరపై ప్రభావం చూపుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ధర స్వయంచాలకంగా తగ్గుతుంది. ప్రజలు ప్రస్తుతానికి వారి ఇంట్లో ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తారని.. టమాటా ధరల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సరఫరా గొలుసులో అంతరాయాలు, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డైనమిక్స్, పలు కారణాల వల్ల టమాట ధరలు పెరగడానికి కారణం అని రాజ్ భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.