Advertisement
తెల్లవారుజామున వచ్చే కలలు తప్పకుండా నిజమై తీరుతాయి. అది మంచి కలైనా, చెడు కలైనా అని మనం గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. మరి ఈ నమ్మకం వెనుక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు అప్పుడే ఫలితాన్నిస్తాయి. మనం నిద్రపోయే క్రమాన్ని నాలుగు యామాలుగా పెద్దలు విభజించడం జరిగింది.
Advertisement
మొదటి యామం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు, రెండో యామం రాత్రి 9 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు, మూడో యామం మధ్య రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, నాలుగో యామం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. నాలుగో యామంలో పడిన కల వృధా ఎందుకంటే అప్పటికే తెల్లవారిపోతుంది కదా.
Advertisement
మనం నిద్ర లేచినా లేవకపోయినా మన జీవనశైలి ఎలా ఉన్నా ఈ యామం యొక్క నియమాన్ని పాటించి తీరాలి. అలాగే రెండో యామంలో పడే కలలు వెంటనే ప్రయోజనం ఇవ్వవట.అవి ఎప్పటికో నిజం అవుతాయి, కాకపోవచ్చు అని అంటారు. మూడో యామం లో పడే కల నిజం అవుతుందని అంటారు.
అలాగే మొదటి యామంలో ఆ టైం కి మనం నిద్ర పోలేం. అయితే మనం ఎలా నిద్రపోతాం, మన నిద్రపోయే శైలి ఏంటి, ఎలాంటి బట్టలు వేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకు వచ్చే కలలు నిజమవుతాయా లేవా వెంటనే నిజమవుతాయా అనే విషయంపై ఆధారపడి ఉంటుందని అంటుంటారు. మనం మంచి మనసుతో నిద్రిస్తూ ఉంటే మంచి కలలే వస్తాయి.