Advertisement
విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో ఏ ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. శివాని అలియాస్ శివ జ్యోతి తెలివితేటలకి పోలీసులు కూడా అవాక్ అవుతున్నారు. భర్తను చంపడానికి స్కెచ్ వేసింది ఆమె అని పోలీసు విచారణలో తేలింది. పైగా భర్తని చంపినట్లు ఎలాంటి అనుమానం రాకుండా ఆమె ఫుల్ గా ప్లాన్ చేసింది. భర్తతో కలిపి అందుకోసం రీల్స్ కూడా చేసింది చూసేవాళ్ళందరికీ ఎంత గొప్ప బంధము అని అనిపించేలా ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. అనుమానం రాకుండా పక్కా ప్లాన్ తో చంపేసి గుండెపోటు తో చనిపోయినట్టు కటింగ్ ఇచ్చింది. భర్తకి మటన్ వండి మందు పోసి తన భార్య చాలా మంచిదని అతనితోనే చెప్పించింది.
Advertisement
భర్త ఫుల్లుగా తాగిన తర్వాత తలగడతో నొక్కి ఊపిరాడకుండా చంపేశారు .పోలీసులకి మాత్రం శివ జ్యోతి ప్రవర్తన పై అనుమానం వచ్చింది. అనుమానస్పద మృతిగానే కేసుని నమోదు చేసారు. అన్యోన్యంగా మేమిద్దరం ఉంటున్నామని రీల్స్ ని కూడా చూపించింది అయినా పోలీసులు నమ్మలేదు. రమేష్ ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
Advertisement
ఆఖరికి పోలీసు విచారణలో ఆమె చంపిన నిజం బయటికి వచ్చింది. చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలో రమేష్ తన భార్య గురించి గొప్పగా చెప్పి ఫీల్ అయ్యాడు. చాలా మంచిదని చెప్పాడు. అయితే అతనికి ముందే చావు వస్తుందని తెలిసిపోయింది. లేకపోతే జీవితం మీద విరక్తి వచ్చిందో అని అతని మాట్లాడిన మాటలను బట్టి అర్ధం అవుతోంది. నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. దేవుడు కరుణిస్తే వందేళ్లు నీతో కలిసి జీవిస్తాను. లేకపోతే మధ్యలోనే పుటుక్కుమంటానని రమేష్ చెప్పడంతో సందేహాలు వస్తున్నాయి.
Also read: