Advertisement
వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ అవ్వడంతో భోళా శంకర్ సినిమా మీద కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కూడా భోళా శంకర్ సినిమా హిట్ అవుతుందని, సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. అయితే భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో నిర్మాత పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో నిర్మాత ఇబ్బందుల్లో పడిపోయాడని తెలుస్తోంది. అనిల్ సుంకర సినీ పరిశ్రమకు వచ్చి పదేళ్లు అయింది.
Advertisement
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పలు సినిమాలు చేశారు. ఈయన దూకుడు, లెజెండ్, సరిలేరు నీకెవరు వంటి భారీ బ్లాక్ బస్టర్స్ ని నిర్మించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్ ని మొదలుపెట్టారు ఈ బ్యానర్ మీద సినిమాలని నిర్మిస్తున్నారు. ఈయన స్వతహాగా వ్యాపారవేత్త అయితే నిర్మాతగా సినీ రంగంలో అడుగు పెట్టారు. అలానే యాక్షన్ 3d అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.
Advertisement
అయితే ఆ సినిమా డిజాస్టర్ రావడంతో మళ్లీ దర్శకత్వం చేయలేదు. నాలుగు నెలల లో రెండు సినిమాలు దెబ్బతీసాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవడంతో లాస్ వచ్చింది. మొదటి షో నుండి కూడా ఏజెంట్ సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నెలలు గడుస్తున్నా ఏజెంట్ సినిమా ఓటీడీలోకి కూడా నోచుకోలేదు.
ఇక భోళా శంకర్ సినిమాలు కూడా నష్టాన్ని తీసుకు వచ్చినట్టు. 80 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి ఈ సినిమా దిగి ఫస్ట్ డే కేవలం 15 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రెండో రోజు చూస్తే బాగా వసూళ్లు డ్రాప్ అయిపోయాయి. ఓటీటీ డీల్ కూడా ఇంకా కుదరలేదుట. 50 కోట్లు షేర్ వసూలు చేయడం కూడా భోళా శంకర్ సినిమాకి కష్టమే. ఇలా అనిల్ సుంకర పెద్ద మొత్తంలో నష్ట పోయినట్టు తెలుస్తోంది.
Also read: