Advertisement
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి బిజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇక ఉప ఎన్నిక తరువాత ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. బీజేపీ నాయకుల మార్పుల్లో రాజగోపాల్ రెడ్డికి కీలక పదవీ లభించింది. జాతీయ స్థాయి పదవీ వచ్చింది. అయినా రాజగోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పై అలిగి దూరంగా ఉంటున్నారా ? మరేదైన కారణం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతుంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలు యాక్టివ్ అవుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు.
Advertisement
Advertisement
గత నెల 21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చివరిసారిగా రాజగోపాల్ రెడ్డి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసారు. ఇక ఆ తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రాలేదు. రాజగోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్ కి ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి కలిసి వచ్చారు. రాజగోపాల్ రెడ్డిని కిషన్ రెడ్డి సముదాయించి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన వ్యూహం ఏంటి ? అనేదానిపై ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నాడనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజగోపాల్ రెడ్డి స్కెచ్ ఎలా ఉంటుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Also Read :
తెలంగాణలో గ్రూపు పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ?
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు..దాని గురించేనా ?