Advertisement
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు మరొక అవకాశాన్ని కల్పించింది. తమ అప్లికేషన్ లో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింద. ఆగస్టు 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చని వెల్లడించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు వివరాల డేటాలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించింది కమిషన్. అఫీషియల్ వెబ్ సైట్ లో ఉన్న ఎడిట్ ఆప్షన్ లింకు క్లిక్ చేసి గ్రూప్ త్రీ క్యాండిడేట్స్ తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని తెలిపింది. ఇక ఇదే లాస్ట్ ఎడిట్ ఆప్షన్ అని.. దీనినే ఫైనల్ డేటా గా పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
Advertisement
Advertisement
మొత్తం 138 గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి అప్లికేషన్లు ప్రారంభమై ఫిబ్రవరి 23న ముగిసింది. గ్రూప్ త్రీ పోస్టులకు మొత్తం ఐదు లక్షల 36,47 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే పరీక్ష తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ 3 లేదా నాలుగో వారాల్లో పరీక్ష తేదీలు ఉండేలా ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూలు సిద్ధం చేసింది కానీ గ్రూప్ 2 నువ్వు నవంబర్ 2 3 తేదీలకు రీసెర్దులు చేయడంతో గ్రూప్ త్రీ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై సందిగ్ధత నెలకొంది గ్రూప్ 2 కంటే ముందే అక్టోబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటుందా లేదా గ్రూప్లో తర్వాత నిర్వహిస్తారా అనేది ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు గ్రూపు 2 పరీక్ష తరువాతనే గ్రూపు 3 ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది.
Also Read :
హీరో ఉపేంద్ర పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. అందుకోసమేనా ?
హీరో నాగార్జునకి రైతుబంధు డబ్బులు అవసరమా ? రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు