Advertisement
చాలామంది డబ్బుల్ని ఫోన్ వెనుక పౌచ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మీకు కూడా ఉందా..? అయితే కచ్చితంగా ఇది ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం వలన మన పనులు ఎంతో ఈజీగా అయిపోతాయి. పైగా ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్ పేమెంట్లు కూడా మనం సులభంగా చేసేసుకోవచ్చు.
Advertisement
చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోన్ కవర్ లో డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. దీంతో మళ్ళీ వేరేగా బ్యాగులు, పర్సులు వంటివి తీసుకెళ్లక్కర్లేదు. ఒక 500 నోటు పెట్టుకుంటే చాలు బయటికి వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకు రావడానికి సరిపోతాయి అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అలా ఫోన్ పౌచ్ లో డబ్బులు పెట్టుకోకూడదు ఇది నిజానికి ఎంతో ప్రమాదమని గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.
Advertisement
ఒక్కొక్కసారి మన ఫోన్ వేడెక్కిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టినా ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినా లేదంటే ఫోన్ ని ఉపయోగించినా ఫోన్ హీట్ ఎక్కి పోతుంది. ఫోన్ హీటెక్కి పోవడం వలన ప్రమాదం కలగొచ్చు. కరెన్సీ నోట్లు తయారీలో అనేక రసాయనాలు వాడుతూ ఉంటారు అయితే ఫోన్ హీటెక్కిపోయినప్పుడు రసాయనాలతో కూడిన కరెన్సీ నోట్లు అడ్డుపడతాయి.
కాబట్టి పేలి పోయే ఛాన్స్ ఉంది. అందుకనే పొరపాటున కూడా డబ్బులు పెట్టుకోకూడదు అలానే చాలామంది బిల్స్, ముఖ్యమైన కాగితాలని వంటివి కూడా పెడుతూ ఉంటారు. కానీ అది కూడా తప్పు. కాగితాలు బిల్స్ లేదంటే ఏమైనా కరెన్సీ నోట్లు పెట్టడం వలన ఫోన్ హీట్ ఎక్కే అవకాశం కూడా ఉంది. ఇలా సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఇటువంటివి పెట్టకుండా చూసుకోండి.
Also read: