Advertisement
ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికీ తెలియడం లేదు. పెళ్లి తర్వాత ఆనందంగా కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు కూడా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం కోసం చూస్తున్నారు. విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనాన్ని రేపిందో అందరికీ తెలుసు. అయితే అదే తరహాలో ఇప్పుడు ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని చంపేసింది ఒక ఇల్లాలు.
Advertisement
కర్ణాటకలో ఇది చోటు చేసుకుంది. భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తని హత్య చేసి ఆ$$గా మార్చేసింది. కడూరు తాలూకా హనుమనహళ్ళకి చెందిన పావనికి నవీన్ అనే అతనితో మ్యారేజ్ అయింది. వీళ్ళకి నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే భార్య ఇంకొకరితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం భర్తకి తెలిసి గొడవ జరిగింది.
Advertisement
పెద్దలు సర్దు చెప్పడంతో కలిసి బాగానే ఉంటున్నారు. అయితే పావని మాత్రం ప్రియుడిని మర్చిపోలేకపోయింది. భర్తను వదిలించుకోవాలని సినిమా స్కెచ్ వేసింది. చపాతీలో నిద్రమాత్రలు కలిపి భర్త పెట్టింది. భర్త నిద్రపోయాక హత్య చేసింది. ఇంటి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసి వచ్చేసింది. ఆ##త్య చేసుకున్నట్లు కల్పించింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి విచారించగా అసలు విషయం బయటపడింది.
Also read: