Advertisement
సినిమా చెట్టు గురించి మీకు తెలుసా..? ఈ చెట్టుకి వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందట ఎంతో అగ్ర దర్శకులు మనసు ని ఇది దోచుకుంది. మరి ఈ చెట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోదారి గట్టు ఉన్న ఈ సినిమా చెట్టు కథని మనం వివరించలేము. ఈ చెట్టు యొక్క చరిత్ర సెంటిమెంట్ 100 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. 1964 నుండి ఇప్పటి దాకా ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూట్ చేశారట.
Advertisement
ఈ చెట్టు ని షూట్ చేసారు అంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని దర్శకులు బలంగా నమ్ముతారు. వందల సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగిందట. ఈ చెట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లో ఉంది 150 ఏళ్ల క్రితం సింగలూరు తాతబ్బాయి అనే ఆయన దీన్ని నాటారట. గోదారి తీరంలో సినిమాలు షూట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి ఎంతో అందంగా సినిమా ఉంటుంది. ఎంతోమంది దర్శకులు ఇక్కడ సినిమాని తీశారట.
Advertisement
దాసరి నారాయణరావు, బాపు, కె విశ్వనాథ్, కృష్ణవంశీ, సుకుమార్ ఇక్కడ సినిమాలు తీసి హిట్టు కొట్టేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య షూటింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ 300కు పైగా సినిమాలని షూట్ చేయగా.. వాటిలో ఎన్నో హిట్లు అయ్యాయి మొట్టమొదట 1964 లో మూగ మనసులు సినిమాని ఇక్కడ షూట్ చేశారు. ఒక పాటని చిత్రీకరించడం జరిగింది. అప్పటినుండి కూడా చాలా సినిమాలని షూట్ చేయడం మొదలుపెట్టారు ఆపద్బాంధవుడు, మురారి ఇలా రాను రాను ఈ చెట్టు దగ్గర ఒక షాట్ అయినా తీయాలని ఒక సెంటిమెంట్ ఏర్పడింది. రామ్ చరణ్ రంగస్థలం, అల్లు అర్జున్ పుష్ప లోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు కూడా.
Also read: