Advertisement
తాజాగా నేషనల్ అవార్డును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ప్రకటించిన నేషనల్ అవార్డు లిస్టులో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పుష్పా ప్రదర్శన గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డును దక్కించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోవడంతో అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Advertisement
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కలెక్షన్స్ పరంగా ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదనంగా ఈ చిత్రం గానూ ఆస్కార్ అవార్డులు కూడా పొందారు. ఇప్పుడు బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ బీజీఎం, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, కేటగిరీలలో ఆర్.ఆర్.ఆర్ నేషనల్ అవార్డులను దక్కించుకొని సత్తా చాటింది.
Advertisement
అయితే ఈ సినిమాపై ఒక కొత్త విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అదేంటంటే.. 2022లో విడుదలైన ఈ సినిమాకు 2021 అవార్డులు రావటం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవార్డులు వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు 2022లో విడుదలైనప్పటికీ 2021 సంవత్సరంలోనే సెన్సార్ పూర్తయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న డేట్ అవార్డులకు సినిమాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా ఆర్ఆర్ఆర్ చిత్రం 2021 లోనే సెన్సార్ పనులను పూర్తి చేసి నేషనల్ అవార్డులకు అర్హత సాధించింది. బాహుబలి చిత్రంతో తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా తెలిసేలా చేశారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నేషనల్ అవార్డులు దక్కించుకొని తెలుగువారి సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పారు.
ముఖ్యమైన వార్తలు :
ఈతరం సెలబ్రిటీల అసలు పేర్లు ఏమిటో తెలుసా..?
సూర్య సినిమాకి అవార్డు రాకపోవడం వెనుక దాగి ఉన్న కథ ఇదేనా ?