Advertisement
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. రజనీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే నెలరోజుల ముందు నుంచి పండుగ చేసుకుంటారు అభిమానులు. ఇటీవల జైలర్ మూవీ విడుదల సందర్భంగా ఐటీ కంపెనీలకు సైతం సెలవు ఇచ్చే అంత క్రేజ్ సొంతం చేసుకున్నారు రజినీకాంత్. తన సినీ కెరీర్ లో చాలామంది హీరోయిన్లతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో రజినీకాంత్-శ్రీదేవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
Advertisement
శ్రీదేవి రజనీకాంత్ కలిసి తెలుగు తమిళ్ హిందీ కన్నడ వంటి భాషల్లో మొత్తం 22 సినిమాల్లో నటించారు. తెరమీద మాత్రమే కాకుండా వీరిద్దరికీ తెర వెనుక కూడా మంచి స్నేహం ఉండేది. రజనీకాంత్ పెళ్లికి ముందు శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవారట. అప్పటికే శ్రీదేవి కమలహాసన్ తో ప్రేమలో పడి మోసపోయింది. ఆ బాధలో ఉన్న శ్రీదేవి ఇంటికి రజనీకాంత్ తరచు వెళ్లడంతో అతన్ని గుడ్డిగా నమ్మేసి ప్రేమలో పడిందట శ్రీదేవి. రజనీకాంత్ తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుందట.
Advertisement
అలా ఒకరోజు తనను పెళ్లి చేసుకోవాలని రజనీకాంత్ ముందు శ్రీదేవి ప్రపోజల్ పెట్టగా.. రజనీకాంత్ మాత్రం నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదని.. మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పారట. దీంతో పట్టరాని కోపం బాధతో రజనీకాంత్ పై మండిపడిందట శ్రీదేవి. అప్పటినుంచి రజనీకాంత్ ని దూరంపెట్టేసిందట. విషయం అప్పట్లో తమిళనాడు మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read :
“బాహుబలి” విజయ్ చేస్తే ఎలా ఉండేది? అనే ప్రశ్నకి నెటిజెన్ ఇచ్చిన సమాధానం చూస్తే నవ్వు ఆపుకోలేరు !