Advertisement
చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన నాలుగో దేశంగా ఇండియా ఖ్యాతిని సొంతం చేసుకుంది. అలాగే జాబిల్లిపై ఉన్న వాతావరణం మరియు భూమి ఏ విధంగా ఉందనే విషయంపై అధ్యయనం జరుగుతుంది.. దీంతో చందమామ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక చందమామ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఈ కావాలి చంద్రుడి మీద ల్యాండ్ కొన్న సెలబ్రిటీలు వీరే అంటూ కొందరు పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సామాన్యులు కూడా జాబిల్లి పైన ల్యాండ్‌లో కొన్న వారి జాబితాలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మహిళ, తన తల్లి మీద ప్రేమతో.. చందమామపై ప్లాట్ కొని తల్లికి బహుమతిగా ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కూతురు సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవాలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ దగ్గర ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.
Advertisement
తన తల్లికి కొంచెం విలువైన బహుమతి ఇవ్వాలన్న విజ్ఞతకి ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు తన తల్లి చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాడుతూ ప్రేమగా గోరుముద్దలు అప్యాయతకు.. అత్యంత అరుదైన బహుమతిగా అదే జాబిల్లిని బహుమతిగా నిర్ణయించుకుంది. ఇక అనుకున్నదే తడవుగా.. ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్లతో జాబిల్లిపై ఓ ప్లాట్ రిజిస్టర్ అయ్యింది.
అటు చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయి భారతదేశం చరిత్ర సృష్టించిన అదే రోజు.. తన తల్లి పేరు మీద అదే జాబిల్లిపై ప్లాట్ రిజిస్టర్ కావటంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం సాయి విజ్ఞతకు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి:
చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. ఇస్రో కీలక ప్రకటన..!
చంద్రునిపై భూమి ఎంత విలువ చేస్తుంది..? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు..?