Advertisement
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ భామ హీరోయిన్ గా నటించిన కొద్ది సినిమాల్లో అయినా కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో జరిగిన వివాదంతో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా తన ఫోటోలు కాంట్రవర్స్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది ఊర్వశి. తాజాగా ఊర్వసిపై మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.
Advertisement
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటారా..? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి మీరేనా.? ఇది ఎలా సాధ్యమైంది. ఇంత భారీ రెమ్యూనరేషన్ రావడం పై మీరు ఏమంటారు అని యాంకర్ ప్రశ్నించారు. ఇది చాలా బాగుంది.. కష్టపడి పైకి వచ్చిన ప్రతి నటుడు, నాటి ఇలాంటి రోజులు చూడాలనుకుంటారని సమాధానం ఇచ్చింది ఊర్వసి రౌతెలా.
Advertisement
మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపిక పదుకొనే, అలియా భట్ వంటి వారికి కూడా నిమిషానికి కోటి రెమ్యూనరేషన్ రావడం లేదని.. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా నిమిషానికి కోటి రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటారని ఊర్వశిని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల మీరు గొప్ప నటి కాలేరు. ఎంతో కష్టపడితేనే గానీ మీకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు లభిస్తుందని.. ఇలాంటి మాటలతో మీరు సాధించేది ఏమీ ఉండదని నెటిజెన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమిషానికి కోటి వసూలు చేస్తున్నానని ఊర్వశి రావు ఇలా చెప్పడం అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.
Also Read :
“బాహుబలి” విజయ్ చేస్తే ఎలా ఉండేది? అనే ప్రశ్నకి నెటిజెన్ ఇచ్చిన సమాధానం చూస్తే నవ్వు ఆపుకోలేరు !