Advertisement
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదన పై ఆశతో చాలామంది అనేక నేరాలకు ఒడిగడుతున్నారు. అలాగే నాచురకం వస్తువులను విక్రయిస్తూ చాలామంది యువకులు రోడ్డుపై తిరుగుతూ ప్రజల నెత్తిన టోపీలు పెడుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే.. ఇటీవల రోడ్లపై అందంగా ప్యాక్ చేసిన ఇయర్ బడ్స్ విక్రయిస్తూ కొంతమంది వ్యక్తులు కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వారి చేతుల్లో ఉన్న వస్తువులను సగం ధరకే ఇస్తామని వాహనదారులను నమ్మిస్తున్నారు. ఇలా గత మూడు రోజులుగా రాష్ట్రంలోని ఈ తరహా యువత చేస్తున్న అల్లర్లపై స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
Advertisement
మంగళగిరి తాడేపల్లి రోడ్డులో ఉదయం పది గంటల సమయంలో పదుల సంఖ్యలో యువకులు రోడ్డుపై తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరి వీపుపై బ్యాగ్, చేతిలో పెట్టె ఉంది. అందులో ప్యాక్ చేయబడిన ఇయర్ బడ్స్ బాక్స్ లు ఉన్నాయి. ఇవి యాపిల్ ఇయర్ బడ్స్ అని యువత రోడ్డుపై వెళ్లే వారికి చెబుతుంటారు. ఆ పెట్టెపై ఇరవై ఆరు వేల రూపాయల ధర ఉంది. వాటిని సగం ధరకే విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. కారులో వచ్చే వారికి పదివేలు చెప్పి ఎంత వస్తే అంత తీసుకుంటారు. ఆ తర్వాత బైక్ పై వచ్చే వారికి ఇయర్ బడ్స్ ఐదు వేల నుంచి వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ బేరం గత మూడు రోజులుగా రోజూ లక్షల్లో సాగుతోంది. వీరంతా హిందీ భాషను మాట్లాడడంతో మహారాష్ట్రకు చెందిన వారని తెలుస్తోంది. ఇవి యాపిల్ ఇయర్ బడ్స్ ప్యాక్ లాగా ఉండడంతో అటుగా వెళ్లే చాలా మంది వాహనదారులు వీటిని ఇష్టపడుతున్నారు.
Advertisement
కానీ అవి ఇమిటేషన్ ఇయర్ బడ్స్ అని తెలిసిన తర్వాత మోసపోయామని బాధపడుతున్నారు. ఇలా వారంతా డూప్లికేట్ ఇయర్ బడ్స్ తెచ్చి విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వారి మాటలకు, వేషధారణకు ఎక్కువగా మోసపోతున్నారు. నిశితంగా పరిశీలించి, వారిని గట్టిగా నిలదీయగా అవి చైనాకు చెందిన అనుకరణ వస్తువులని అని తేలింది. గత మూడు రోజుల నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంతా భావిస్తున్నారు. వీరంతా విజయవాడలో స్థిరపడినట్లు తెలుస్తుంది.
కొద్దిరోజుల క్రితం గుంటూరులో కూడా మహిళలు తమ ప్రాంతంలో కరువు కాటకాలతో విరాళాలు ఇవ్వాలని మాయమాటలు అమ్ముతున్నట్లు నటిస్తూ వాహనదారుల వెంటపడడం చూశాం. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారు కాగా, మ్యాజిక్ స్లేట్‌ల విక్రయానికి భిక్షాటన చేస్తున్నారని పసిగట్టిన పోలీసులు వారందరినీ రాజస్థాన్‌కు పంపించారు. తాజాగా తాడేపల్లి మంగళగిరి రోడ్లపై విక్రయిస్తున్న ఇయర్ బడ్స్ కూడా ఇదే తరహాలో ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఇక పోలీసులు జోక్యం చేసుకుని వీరిని ఆటకట్టించాలని స్థానికులు కోరుతున్నారు.