Advertisement
హనుమంతుడిని పూజించేటప్పుడు చాలా మంది తమలపాకులను వేస్తుంటారు. తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తుంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో కచ్చితంగా పూజ చేస్తారు. పూల కంటే ఎక్కువగా ఆకులకే ప్రాధాన్యత ఇచ్చి హనుమంతుడిని పూజిస్తారు. హనుమంతుడు ని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి అంటే హనుమంతుడికి ఎందుకు ఇష్టమో అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వల్ల ఆర్థిక బాధలు ఏమీ ఉండవు. గండాలు వంటివి ఈజీగా తొలగిపోతాయి. హనుమంతుడు ఆకు పూజని ఎంతో ఇష్టపడతాడట. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మవారిని కలుసుకున్న తర్వాత రాముడికి వచ్చి సీత క్షేమం గురించి చెబుతారు.అప్పుడు సంతోషంగా రాముడు తమలపాకుని తెంపి మాలగా ఆంజనేయ స్వామి మెడలో వేస్తారు.
ఆంజనేయస్వామి తోకతో లంకా నగరాన్ని తగలబెట్టి వచ్చినప్పుడు చల్లగా తమలపాకు ఉంచుతుంది. హనుమంతుని మెడలో రాములవారు తమలపాకు మాలిని వేయడం వల్ల ఆయన ఎంతో సంతోషపడతారు. అయితే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తారని.. కోరుకున్నకోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. కాబట్టి ఆంజనేయస్వామిని ఇలా కొలుస్తారు. అందుకే పూలతో కంటే ఆకుల వల్ల ఆంజనేయ స్వామికి సంతోషం కలిగి మనకి వరాలు ఇస్తారు.