Advertisement
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరు మార్చబోతుందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇండియా అని కాకుండా G-20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో భారత్ అని ప్రచురించడంతో అందరిలో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా జీ-20 సమ్మిట్ సంబంధించిన ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేయాల్సి ఉండగా.. దానికి బదులు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది.
Advertisement
ప్రధానంగా విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టినందుకే దేశం పేరు మార్పు చేసేందుకు రాజకీయాల కోసం వాడుకుంటారా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమీ భారత్ గా మార్చుకుంటే మీరు దేశం పేరు మళ్లీ మార్చుతారా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదో మెలిక పెట్టబోతుందని.. ప్రజలను గందరగోళానికి గురి చేయబోతుందంటూ విమర్శిస్తున్నారు.
Advertisement
నిజానికి దేశంలో ప్రజలందరి వద్ద ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంది. పేదలు ఏ పథకం లబ్ది పొందాలన్నా ఆధార్ కార్డు,రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు వంటివి తప్పనిసరి. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్. ఇలా వీటన్నింటిపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దేశం పేరు మార్చితే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని కార్డులపై ఉండాలి. లేకపోతే ఆ గుర్తింపు కార్డులు చెల్లే అవకాశం ఉండదు. మరోసారి ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజలు బారులు తీరి వాటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కరెన్సీ నోట్లపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మార్చడం వల్ల మరోసారి కరెన్సీ నోట్లను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొంది అని కొందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం కొనసాగింది. ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు బీజేపీ ప్లాన్ చేస్తుందని ఊహగానాలు వినిపించాయి. ఇప్పుడు ఇండియా పేరు మార్పు అంశం తెరపైకి వస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అసలు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఇక దేశ ప్రజల సందేహాలు తొలగిపోవాలంటే బీజేపీ పెద్ద స్పందిస్తే కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.
Also Read :