Advertisement
నటి, నిర్మాత మరియు దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయనిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మహిళా దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు విజయనిర్మల. ఆమె సాధించిన లెక్కలేనన్ని విజయాలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా విజయనిర్మల 2019 జూన్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక భర్త సూపర్‌స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. ఇక ఇద్దరి మరణం తర్వాత వారు సంపాదించిన ఆస్తి ఎవరిది అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది.
Advertisement
తాజాగా ఇదే విషయంపై విజయనిర్మల మనవడు, నటుడు నవీన్ స్పందించారు. నవీన్.. నరేష్ మొదటి భార్య కొడుకు అనే విషయం అందరికి తెలిసిందే. నాన్నమ్మ(విజయనిర్మల)కు సంబంధించిన ఆస్తుల్లో సగం నాకు వీలునామా రాయమని మా నాన్నని కోరింది. మిగిలిన సగం ఆస్తి మా నాన్నకే చెందుతుందని చెప్పేవారు. అప్పుడు నాకు ఆస్తి విషయంలో పెద్దగా పట్టింపు లేదు. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నాకు, మా నాన్నగారికి అవగాహన వచ్చింది.
Advertisement
ప్రస్తుతం ఈ ఆస్తికి మా నాన్నే అధిపతి.. ఆయన ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఈ ఆస్తికి నువ్వే వారసుడివి అని నాన్న అన్నారు. ప్రస్తుత ఆస్తి వివరాల గురించి నాకు పెద్దగా తెలియదు. నాన్నగారి పర్యవేక్షణలో ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆస్తి విషయంలో మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.
నాన్నమ్మ ఆస్తికి మేము సంరక్షకులం మాత్రమే. నాన్న తర్వాత ఆస్తి నాకు అప్పగిస్తే ఎక్కడికీ పోకుండా కాపాడుకోవడం నా బాధ్యత. నా తమ్ముళ్లు రణ్వీర్, తేజ ఇద్దరూ నాకు ఇష్టం. కానీ తేజ అంటే నాకు ప్రాణం. నేను అతనిని ఎంతగానో ప్రేమిస్తాను.. అతనికి నేనూ అంతే. మా మధ్య మంచి బ్యాండింగ్ ఉంది అని ఇద్దరి ఇంటర్వ్యూ ద్వారా నవీన్ తెలియజేశారు .
Also read :
బిగ్ బాస్ సీజన్ 7లో అత్యధిక పారితోషికం వారికేనా ?
రవితేజ మూవీలో విలన్ గా నటించబోతున్న మంచు మనోజ్ ..?