Advertisement
యాంకర్ సుమ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె ఎంతటి గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిన, సినిమా అవార్డు ఫంక్షన్ లైనా ఇండస్ట్రీలో ఇంకేదైనా సరే తనదైన శైలి యాంకరింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను హీరో హీరోయిన్లను తన మాటలతో ఆకట్టుకుంటుంది. అలాంటి సుమ కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ అప్పట్లో ఓ మోస్తరు విజయం అందుకుంది.
Advertisement
అలాంటి సుమ రాజీవ్ కనకాల కోసం వారం రోజులపాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా తన ప్రేమను గెలిపించుకుందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సుమా తన వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలు పడిందట. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి లవ్ స్టోరీ కస్తూరి సీరియల్ ద్వారా మొదలైంది. కానీ పెళ్లి మాత్రం చాలా కఠినంగా జరిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రాజీవ్ కనకాలని ప్రేమిస్తున్నట్టు సుమ వారి తల్లిదండ్రులకు చెప్పగానే వారు పెళ్లికి ఒప్పుకోలేదట.
Advertisement
కానీ రాజీవ్ ఇంట్లో మాత్రం సుమతో పెళ్లికి వారు ఒప్పుకున్నారు. కానీ సుమ ఇంట్లో రాజీవ్ తో పెళ్లికి ఒప్పుకోకపోగా గదిలో వారం రోజుల పాటు బంధించారట. కానీ సుమ వారం రోజులు రాజీవ్ నే తలుచుకుంటూ కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉందట. దీంతో వారి తల్లిదండ్రులు చేసేదేమీ లేక చివరికి ఆమెకు రాజీవ్ పై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని ఘనంగా పెళ్లి చేశారట. ఇక అప్పటినుంచి రాజీవ్ కనకాల ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని గొడవలు జరిగినా కాసేపు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత కలిసిపోతూ ఉంటారట. ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరి పిల్లలు.