Advertisement
కె ఎల్ రాహుల్ తనకి అయినా గాయం వలన క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ గాయం వలెనే పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్ల్లో సరిగ్గా ఆడలేదు. సూపర్-4 మ్యాచ్ కి కూడా రాహుల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేడు. కానీ, శ్రేయాస్ అయ్యర్ గాయపడడం వలన.. అతని ప్లేస్ లో రాహుల్ ఆడాల్సి వచ్చింది. దాదాపు 131 రోజుల తరువాత తిరిగి వచ్చిన రాహుల్ ఈ ఆటలో తన సత్తా చూపించారు.
Advertisement
రీ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సెంచరీ కొట్టేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆసియా కప్ లో ఇండియాకు పాకిస్థాన్ కు మథ్య జరిగిన మ్యాచ్ లో రాహుల్ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నారు. ఈ ఛాన్స్ ఆఖరి నిమిషంలోనే వచ్చినా.. రాహుల్ కు తన సత్తా చూపించుకోవడానికే అవకాశం వచ్చినట్లు అయింది. రాహుల్ కి ఈ అవకాశం ఇవ్వడంపై చాలా విమర్శలే వచ్చాయి. అయితే.. వాటన్నిటికీ తన సెంచరీతో రాహుల్ గట్టి సమాధానం చెప్పారు.
Advertisement
గౌతమ్ గంభీర్ కూడా రాహుల్ పై విమర్శలు గుప్పించారు. కె ఎల్ రాహుల్ పనికిరాడని, ఇషాన్ కిషన్‌ను జట్టులో ఉంచుకోవాలని ఆయన కామెంట్స్ చేసారు. IPL 2023 సమయంలో రాహుల్ తొడకు గాయమైంది. అందువల్లే రాహుల్ ఆటకి బ్రేక్ ఇచ్చాడు. దానితో అతని స్థానంలో ఇతర ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ వారు సత్తా చాటడంలో సక్సెస్ అవ్వలేదు. రాహుల్ రీ ఎంట్రీ పై చాలా కామెంట్స్ వచ్చాయి. నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కు రాహుల్ స్థానంలో అవకాశం ఇవ్వాలని, రాహుల్ ను తప్పించాలని గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. ఆ కామెంట్స్ కు రాహుల్ తన సెంచరీతోనే సమాధానం ఇచ్చారు.