Advertisement
ఇండియాకు, పాకిస్థాన్ కు జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ రెండు విషయాల్లోనూ భారత్ జట్టు ఆటగాళ్లు ఇరగదీసేసారు. ఈ మ్యాచ్ ను మరోసారి గుర్తు చేసుకోవాలి అన్నా పాకిస్థాన్ ఆటగాళ్లకు భయం వేసేలా ఇండియా జట్టు ఇరగదీసింది. విరాట్ కోహ్లీ 122 (నాటౌట్) స్కోర్ చేయగా.. మరోవైపు రాహుల్ కూడా సెంచరీ కొట్టి తన ఫిట్ నెస్ పై ఉన్న భ్రమలను తొలగించేసాడు. వీరి తర్వాత కులదీప్ యాదవ్ 5 /25 స్కోర్ తో మేజిక్ చేసాడు.
Advertisement
వరుణుడి అడ్డంకులు ఎదురైనప్పటికీ రోహిత్ సేన భారీగానే స్కోర్ చేసారు. మొదట బాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 356 స్కోర్ చేసింది. మరోవైపు పాకిస్తాన్ 32 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసింది. 8 వికెట్ల వద్దే పాకిస్తాన్ తన ఓటమిని అంగీకరించింది. మరో రెండు వికెట్లు ఉండాలి కదా అని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానికి అసలు కారణం ABS HURT.
Advertisement
ఇంతకీ ABS HURT అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ABS HURT అంటే ఆబ్సెంట్ హర్ట్ అని అర్ధం. పాకిస్థాన్ పేసర్లు నసీం, హరీస్ రౌఫ్ తమకు ఉన్న గాయాల కారణంగా ఈ మ్యాచ్ కు హాజరు కాలేదు. దీనితో పాకిస్తాన్ ఎనిమిదవ వికెట్ పడగానే ఆల్ అవుట్ అయిపోయినట్లు అంపైర్లు ప్రకటించారు. అందుకే పాక్ ముందుగానే ఓటమిని ఒప్పుకోవాల్సి వచ్చింది.
మరిన్ని..