Advertisement
హనుమంతుడి భక్తులే కాదు దాదాపు హిందువులందరు తమకు భయం వేస్తున్నప్పుడు, ఆరోగ్యం కోసం హనుమాన్ ను తలుచుకుంటూనే ఉంటారు. ఆయన ప్రార్థనలలో ముఖ్యమైనది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలిసాను తులసీదాస్ రచించారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఒకసారి, అక్బర్ తనకు రాముడిని చూపించమని తులసీదాస్‌ను సవాలు చేశాడు, రాముడిని నిజమైన భక్తితో మాత్రమే చూడగలరని తులసీదాస్ చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న అక్బర్ కవిని కటకటాల వెనక్కి నెట్టాడు. అప్పుడు తులసీదాస్ ‘హనుమాన్ చాలీసా’ వ్రాసి 40వ రోజు పఠించారు. ఆ వెంటనే, వానరుల సైన్యం మొత్తం అక్బర్ రాజభవనాన్ని దోచుకుంది. వెంటనే మొఘల్ తన తప్పును గ్రహించి, తులసీదాస్ పాదాలపై పడి అతన్ని విడుదల చేశాడు.
Advertisement
పీడకలలతో కలవరపడే వ్యక్తి నిద్రపోయే ముందు చాలీసాను చదివి నిద్రిస్తే ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. గత అనుభవాలను మర్చిపోలేక బాధపడేవారు హనుమాన్ చాలిసాను చదివిన వారికి ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు హనుమాన్ చాలీసా లోని ఈ శ్లోకాన్ని పఠించడం వలన ఆ వ్యక్తులకు అన్ని సమస్యలు తొలగిపోతాయి.
“బుద్ధిహీన తను జానికే, సుమిరౌం పావ కుమార |
బల – బుద్ధి విద్యా దేహు మోహిన్, హరహు కలేశ బికార||”
Advertisement
హనుమాన్ చాలీసా లో వచ్చే ఈ శ్లోకం ద్విపద శ్లోకం. దీని అర్ధం ఏంటంటే.. భగవంతుడా.. నేను అవివేకుడను. నాకు బలాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి, నాకు ఉన్న కష్టాలను తొలగించి నన్ను అనుగ్రహించండి అని అర్ధం. భక్తిగా హనుమంతుడిని తలచుకుని.. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటె.. హనుమంతుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి ఆ హనుమంతుడు మీ సమస్యలను పరిష్కారం చేస్తాడు.