Advertisement
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మౌనాన్ని వీడారు. నిన్న, మొన్నటి వరకు ఎంపీగానే పోటీ చేస్తానని ప్రకటించారు బండి సంజయ్. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తానని ఓ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. వేరు వేరుగా ఎన్నికలు జరిగితే అసెంబ్లకి పోటీకి సై అంటున్నారు. తాను నెక్ట్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎక్కడి నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు.
Advertisement
Advertisement
కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి బండి సంజయ్ కుమార్ రెండుసార్లు పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ గట్టీ పోటీనిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత సంజయ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఆ తరువాత రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో అధ్యక్ష బాధ్యతలు తప్పించారు. అదేసమయంలో బండి సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పారు. ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తానని.. కార్యకర్తలకు మొన్నటివరకు సంకేతాలు ఇచ్చారు. తాజాగా కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటీవలే గంగుల కమలాకర్, బండి సంజయ్ ఒక్కటే అని ప్రచారం జరిగింది. మంత్రి గంగుల కోసమే..
బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం కూడా సాగింది. తాజాగా పోటీ చేస్తానని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.