Advertisement
తమిళ్ హీరో విశాల్ తన ప్రతి తమిళ్ మూవీ ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. తెలుగులో విలన్ గా పరిచయమైనా తమిళ నట హీరో గా సినిమాలు చేసిన నటుడు S J సూర్య, విశాల్ కలిసి మార్క్ ఆంటోనీ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందొ ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి.
Advertisement
- మూవీ : మార్క్ ఆంథోనీ
ఆక్టర్స్ : విశాల్, S.J.సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతూ వర్మ, అభినయ, రెడిన్ కింగ్స్లే, Y.G.మహేంద్రన్.
ప్రొడ్యూసర్ : ఎస్. వినోద్ కుమార్
డైరెక్టర్ : అధిక్ రవిచంద్రన్
మ్యూజిక్ : జి.వి.ప్రకాష్ కుమార్
సినిమా తమిళ సినిమా అయినప్పటికీ… ఈ సినిమా అన్ని భాషా ప్రేమికులకు నచ్చే విధంగానే ఉంటుంది. మార్క్ ఒక మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. అతని తండ్రి ఒక గ్యాంగ్ స్టర్. మెకానిక్ గా పని చేస్తున్న మార్క్ ఓ సారి టైం ట్రావెలింగ్ మిషన్ ని చూస్తాడు. దాని ద్వారా టైం ట్రావెల్ చేసి తన తల్లిని కలుసుకోవాలని అనుకుంటాడు. విడిపోయిన తన తల్లి దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. తన కుటుంబం గురించి తనకు తెలియని విషయాలను మార్క్ తెలుసుకుంటాడు. టైం ట్రావెలింగ్ మిషన్ ద్వారా మార్క్ ఏ కాలానికి వెళ్ళాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. మార్క్ తండ్రి ఎవరు? మార్క్ ఎందుకు అలాంటి లైఫ్ గడుపుతున్నాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ పై సినిమా రావడం ఇదేమీ మొదటి సారి కాదు. బాలయ్య బాబు ఆదిత్య 369 నుంచి చాలా సినిమాలే వచ్చాయి ఈ కాన్సెప్ట్ కి కొంత కొత్తదనాన్ని, ఎమోషన్స్ ను ఆడ్ చేసి తీసిన సినిమా మార్క్ ఆంటోనీ. దర్శకుడు ఈ పాయింట్ ని కొట్టగానే రాసుకున్నాడు. కానీ ప్రేక్షకులకు సినిమా తెలిసిపోతూ ఉంటుంది. అయినప్పటికీ బోర్ కొట్టదు. టేకింగ్ చాలా బాగుందని అనిపిస్తుంది. విశాల్ తన లోని డిఫరెంట్ షేడ్స్ ని చాలా బాగా చూపించారు. ఇక S J సూర్య సంగతి చెప్పక్కర్లేదు. ఆయన నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఒకరకమైన స్టయిల్ తో డబ్బింగ్ చెప్పిన ఆయనకు ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇస్తుంది. సిల్క్ స్మిత లాగ కనిపించే విష్ణుప్రియ ఈ సినిమాలో ఆమె రోల్ పోషించి ఆమెను గుర్తుకు తెచ్చారు. నటీనటులు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా అప్పటి కాలానికి తగ్గట్లుగా ఉండి సినిమా లెవెల్ ను పెంచాయి. ఎక్స్పరిమెంటల్ సినిమాలు చూడడానికి ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
మరిన్ని..