Advertisement
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. టీడీపీ నేతలు అక్రమ అరెస్ట్ అంటూ పేర్కొంటున్నారు. అరెస్టు చేయడానికి గల కారణాలు కోర్టులో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు అరెస్టు గురించి 12 ప్రశ్నలను సంధించారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా CBN ని సమర్ధించే వాళ్ళెవరైనా ఈ 12 క్వశ్చన్స్ కి వన్ వర్డ్ లొ *ఆవునా? కాదా ?* అనే ఫార్మాట్ లో సమాదానమిస్తారా ?
1. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్. .. … అవునా ?
2. ఈ ఫేక్ ఒప్పందం తోనే రూ 300 కోట్లు పైగా ఇచేసారు .. .. అవునా ?
3. ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారు . డబ్బు విడుదలకోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు. ..అవునా ?
4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ,సీమెన్స్ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది …అవునా ?
5. 90శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్ చెప్పింది …. అవునా ?
6. ఈమేరకు సెక్షన్ 164 CRPC కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు, సీమెన్స్ అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు . …అవునా ?
Advertisement
7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది … *అవునా ?
8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది . …అవునా ?
9. రూ. 300 కోట్లకుపైగా డబ్బును షెల్ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు. ….అవునా ?
10. స్కిల్ కేసులో ED దర్యాప్తుచేసి నలుగురిని అరెస్టుచేసి ఆ విషయాన్ని ED తన అక్కౌంట్ ద్వారా ట్వీట్ చేసింది . అధికారికంగా పత్రికా ప్రకటన విడుదలచేసింది .. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ అయిన ED ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు … అవునా ?
11. విజయవాడలోని ACB కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్ విధించింది … అవునా ?
12. ఇళ్లనిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబుగారి చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో , అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అనేక షెల్ కంపెనీలు, నిందితులైన యోగేష్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ED చెప్తోంది. …అవునా ?
ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు ? ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే! అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.