Advertisement
నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి మాట్లాడే రుగ్మతని సోమ్నిలోకీ లేదా స్లీప్ టాకింగ్ అని పిలుస్తారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగేది కాదు. బాధితులు తమకు తెలియకుండానే నిద్రలో మాట్లాడేస్తూ ఉంటారు. సోమ్నిలోక్వి అనేది ఒక రకమైన పారాసోమ్నియా, ఇది సాధారణంగా దంతాలు గ్రైండింగ్ లేదా స్లీప్వాకింగ్ వంటి నియంత్రణ లేని పనులను చేయిస్తుంది. సోమ్నిలోక్వి సాధారణంగా నాన్-రాపిడ్ ఐ మూవ్మెంట్ (NREM) లేదా రాపిడ్ ఐ మూవ్మెంట్ (REM) నిద్రలో ఉన్నప్పుడే జరుగుతుంది.
Advertisement
ఇది మగ మరియు ఆడవారిలో సమానంగా సంభవిస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో, ఇది వంశపారంపర్యంగా ఉండవచ్చు. సోమ్నిలోకీ సాధారణంగా వ్యక్తి యొక్క మాతృ భాషలోనే జరుగుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులలో స్లీప్ టాక్ వచ్చినప్పటికీ, ఇది స్లీప్ అప్నియా, నైట్ టెర్రర్స్, క్రానిక్ తలనొప్పి కారణం వలన అయ్యుండొచ్చు. చాలా మంది నిద్రలో మాట్లాడుతుండడాన్ని సరదాగానే తీసుకుంటారు. కానీ నిజానికి ఇది చాలా సీరియస్ సమస్య. అసలు స్లీప్ టాకింగ్ కి ఇదే ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. ఇప్పటివరకు అసలు కారణం కనుగొనబడలేదు. పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్, డిప్రెషన్ , జన్యుపరమైన కారణాల వలన ఇది జరుగుతూ ఉండవచ్చు. మానసిక ఒత్తిడి మరియు పీడకలల వంటి కారణాల వల్ల కూడా కొందరు నిద్రలో మాట్లాడుతూ ఉంటారు.
Advertisement
ఈ సమస్య ఉన్న వారికంటే వారి పక్కన పడుకున్న వారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇది తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నించాలి. అర్ధరాత్రి వరకు సెల్ల్ ఫోన్ చూడడం, టివి చూడడం తగ్గించాలి. హారర్ చిత్రాలు చూడడం తగ్గించాలి. మానసిక ఒత్తిడి కలిగిస్తున్న విషయాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని..
బాలయ్య-ఎన్టీఆర్ వార్ కి, కొడాలి నానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
వరుణ్ తేజ్ తో పాటు నిహారికకు కూడా రెండో పెళ్లి చేస్తున్నారా? అబ్బాయి ఎవరంటే?
Alasandalu and Bobbarlu: Seeds Benefits, Uses, Images in Telugu అలసందల వలన కలిగే లాభాలేంటి?