Advertisement
మన కాన్సంట్రేషన్ ను పెంపొందించుకోవడానికి, వారమంతా ఉత్సాహంగా పని చేయడానికి కొన్ని వేల డైలీ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే.. వాటిల్లో మనం ఏ అలవాట్లు ఎంచుకుంటున్నాం అన్నది ముఖ్యం. వీకెండ్ అనగానే మనందరం సరదాగా గడిపేయాలని, ఏ పని, ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలని కోరుకుంటాం. అయితే.. వారమంతా ఉత్సాహంగా పని చేయాలంటే.. మనం వీకెండ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిద్దాం. ముందుగా.. సక్సెస్ ఫుల్ పీపుల్ తమ వీకెండ్స్ లో ఏమేమి చేస్తుంటారో తెలుసుకుందాం.
Advertisement
మీరు సరైన విశ్రాంతిని ఇవ్వకపోతే మీ శరీరం సరిగ్గా పని చేయదు. అందుకే చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ వారాంతాల్లో తమకు కావలసినంత నిద్రపోతారు. వారి నిద్ర సమయం సగటున రాత్రికి ఏడు గంటల 29 నిమిషాలు. టిమ్ కుక్, బిల్ గేట్స్, జాక్ డోర్సే మరియు జెఫ్ బెజోస్ అందరూ రాత్రికి కనీసం ఏడు గంటల పాటు నిద్రపోతామని తమ ఇంటర్వ్యూలలో తెలిపారు. మీ ఉద్యోగరీత్యా అంత సేపు నిద్రపోవడానికి వీలు కాకుంటే.. కనీసం వీకెండ్స్ లో అయినా కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సరిగ్గా సమయం గడపలేకపోతున్నాం అని అనిపిస్తుంటే.. కచ్చితంగా వీకెండ్స్ లో వారిని కలవడానికి ప్లాన్ చేసుకోండి. ఇది మిమ్మల్ని వారం అంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
Advertisement
వారంలో ఏమేమి పనులు పూర్తి చేసుకోవాలో సక్సెస్ ఫుల్ పీపుల్ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. తద్వారా వారు సోమవారం ఉదయాన్నే తమ పనిని ప్రారంభించేస్తారు. స్వంత పనులను వారికి వారే చేసుకుంటారు. తద్వారా రిజల్ట్ వారికి నచ్చినట్లే ఉండడం కాకుండా.. సులువుగా, త్వరగా పూర్తి చేసుకుంటారు. దీని ద్వారా సమయాన్ని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వారికోసం ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయాన్ని కేటాయించుకుంటారు. ఈ సమయంలో తమకు నచ్చిన పనులను చేయడం మాత్రమే కాకుండా.. తమ ఆలోచనలకు పదును పెట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. బిల్ గేట్స్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వారి పనులలో ముందు ఉండడం వలనే వారు త్వరగా విజయాన్ని సాధించగలిగారు.