Advertisement
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం విధితమే. కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్వాష్ పిటిషన్ ను సుప్రీంలో దాఖలు చేశారు చంద్రబాబు న్యాయవాదులు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు లాయర్ల టీమ్ లోకి మరో ప్రముఖ న్యాయవాది ఎంట్రీ ఇవ్వడం విశేషం. అదేవిధంగా చంద్రబాబు పై ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పిట్ వారెంట్ లపై విచారించాలని సీఐడీ కోరింది. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంలో చంద్రబాబు తరపు న్యాయవాదిపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీకోర్టు కూడా చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
Advertisement
మరోవైపు స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఏం జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సోమవారం ఈ కేసును చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఈ కేసు అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్ స్లిప్ ఇచ్చాం. పిటిషనర్ కస్టడీలో ఉన్నారు. ఇది ఏపీకి సంబంధించిన కేసు.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సీజేఐ స్పందించి ఇవాళ రమ్మని చెప్పి ముగించారు. మరోవైపు చంద్రబాబు కేసులు వాదించేందుకు ఆయన లాయర్ల టీమ్ లోకి ప్రముఖ న్యాయవాది ప్రమోద్ దూబే చేరారు.
Advertisement
ఏసీబీ కోర్టులో జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. అయితే జడ్జీ న్యాయవాదిని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టులో చంద్రబాబు తరపున దమ్మలపాటి శ్రీనివాస్ తో పాటు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించనున్నారు. ఎక్కువగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించినప్పటికీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈనెల 28 నుంచి అక్టోబర్ 03 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేసులో ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరీ.