Advertisement
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అక్టోబర్ 03న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందుకు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. సుప్రీంకోర్టు గత తీర్పులు, ఈ కేసులో సాంకేతిక అంశాలు దృష్ట్యా సానుకూల తీర్పు వస్తుందని.. చంద్రబాబు తరపు న్యాయవాదులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది.
Advertisement
ముఖ్యంగా చంద్రబాబు పై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. కింది కోర్టులో చుక్కెదురైన వారు హైకోర్టును ఆశ్రయిస్తారు.. కింది కోర్టులో గెలిచిన వారు హైకోర్టులో కేవీఎల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కేవీఎట్ అంటే.. కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీస్ ఇచ్చి కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. వారి వాదనలను కోర్టు వినాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
కేవీయట్ పిటిషన్ వ్యాలిడిటీ కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. చంద్రబాబు కేసు విచారణను జగన్ ప్రభుత్వం అడ్డగించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని.. అరెస్ట్ చేయడంలో సైతం నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంటుంది. మొత్తానికి అక్టోబర్ 03న బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉంది. మంగళవారం రోజంతా విచారణ జరిగే అవకాశముందని సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.