Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఐఆర్ఆర్ కేసు, ఫైబర్ గ్రిడ్ వంటి కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే చంద్రబాబుకి మరో షాక్ తగిలేవిధంగా కనిపిస్తోంది. 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తాజాగా తెరపైకి వచ్చింది. అక్టోబర్ 4న ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. ఈ కేసుకు సంబంధించి 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాటి ఏపీ సీఎం చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం.
Advertisement
ఇక తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ కూడా దాఖలు వేశారు. అయితే 2015లో జరిగిన ఈ కేసు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా.. పట్టుకున్నామంటూ అప్పట్లో తెలంగాణ ఏసీబీ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో పెను సంచలనంగా మారింది. ఇక ఆ వీడియోలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఓ ఆడియో కూడా బయటికి రావడం విశేషం. దీంతో ఆ డబ్బులను చంద్రబాబు పంపించారని టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు. ఇన్ని రోజుల వరకు ఈ కేసు చాలా సెలెంట్ గా ఉండింది. అయితే చంద్రబాబు కావాలని ఇరికించాలనే కేసుల మీద కేసులు వేస్తున్నారని దీనిని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్ వలన ఒరిగిందేమీ లేదు.. షాక్ అవుతున్న బాలకృష్ణ చిన్న అల్లుడి కామెంట్స్..!
ఇప్పటికే చంద్రబాబు కి సంబంధించి స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు కోర్టులో బిజీగా ఉన్న సమయంలోనే తాజాగా ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి వచ్చింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై దాదాపు 23 రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు అక్టోబర్ 03న విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటికి వచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న సమయంలో ఈ కేసు మళ్లీ బయటికీ రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు సంబంధించిన కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అందరూ చర్చించుకోవడం గమనార్హం. చంద్రబాబు కేసుల విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
ఇవి కూడా చదవండి : చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!