Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీ లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అధినేత అరెస్ట్ అయ్యి ఉండడంతో.. పార్టీ బాధ్యతలను అటు నారా లోకేష్ ఇటు నందమూరి బాలకృష్ణ తమ భుజ స్కంధాలపైకి ఎత్తుకున్నారు. బాలకృష్ణ ఓ వైపు సినిమా పనులు చూసుకుంటూనే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
ఇది ఇలా ఉంటె.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి సినీ వర్గాల నుంచి వచ్చిన స్పందన తక్కువే. వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇటీవల సప్త సాగరాలు దాటి సినిమా ప్రమోషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించాలి అంటూ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సురేష్ బాబుని ఓ విలేఖరి ప్రశ్నించగా.. సినిమాల్లోకి రాజకీయాలు వద్దు అంటూ ఆయన సాఫ్ట్ గా తెలిపారు.
Advertisement
వీటిని కూడా చదవండి: ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ఈ పర్యటన వెనుక అసలు కారణం చంద్రబాబు నాయుడు కేసులేనా?
అయితే.. ఈ విషయమై స్పందించిన బాలకృష్ణ సినిమా ఫీల్డ్ లో ఎవరు సిబిఎన్ గురించి పట్టించుకున్న.. పట్టించుకోకపోయినా.. ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా అస్సలు పట్టించుకోను అని ఆయన అన్నారు. తన అక్క పురంధేశ్వరితో కలిసి ముందుకు వెళ్తానని.. ఆయన అరెస్ట్ గురించి కేంద్రంతో సంప్రదిస్తానని పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ వెనక కేంద్రం హస్తం ఉందొ లేదో తమకు తెలియదని.. అనవసరంగా ఎవరిని నిందించబోమని బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే.. ప్రతి సారి ఈ అంశంలోకి జూనియర్ ఎన్టీఆర్ ని లాగడం టీడీపీ కి మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అని నెటిజన్స్ పేర్కొన్నారు.
వీటిని కూడా చదవండి: చంద్ర బాబు అరెస్ట్ తరువాత స్కంద సినిమాలో చేసిన మార్పులు ఇవేనా ?