Advertisement
ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది అంటే ముందుగా ఆడవారు తమ నెలసరి కాలం గురించి ఆలోచిస్తారు. ఆ సమయానికి నెలసరి రాదు అని తెలిస్తే ఇబ్బంది లేదు. కానీ, అదే సమయానికి నెలసరి ఉంటె మాత్రం.. దానిని వాయిదా వేయాలని అనుకుంటారు. అయితే ఇందుకోసం డాక్టర్ ని సంప్రదించడం మానేసి ఫ్రెండ్స్ చెప్పారనో.. చుట్టూ పక్కలవాళ్ళు చెప్పారనో తోచిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే.. దీని వలన కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
Advertisement
మందులతో నెలసరిని తాత్కాలికంగా వాయిదా వేయడం కొత్త సమస్యలనే తెచ్చి పెడుతుంది. దీని వలన హార్మోన్ల ఇంబ్యాలన్సు తో బాధపడాల్సి ఉంటుంది. మనం తినే ఆహారపదార్ధాలు, వ్యాయామం, ఆలోచనలు, సె!క్స్ ఇలా అన్ని విషయాలు మన పీరియడ్స్ పై ప్రభావం చూపిస్తాయి. వీటిని వాయిదా వేయడం కోసం మందులు వాడడం మాత్రం వంద శాతం తప్పే. మీరు పీరియడ్ ని వాయిదా వెయ్యాలని అనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులను సంప్రదించి గర్భ నిరోధక హార్మోనల్ మందులను ఉపయోగించాలి. ప్రొజెస్టిన్ మందులను కూడా పీరియడ్స్ ను ఆలస్యం చేయడానికి ఇస్తుంటారు.
Advertisement
అలాగే నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా పీరియడ్స్ ని తాత్కాలికంగా ఆపుతాయి. వీటిని కూడా నెలసరిని వాయిదా వేయడానికి ఉపయోగించవచ్చు కానీ.. వీటిని నమ్మడానికి వీలు లేదు. అయితే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులను వాడాలి. ఈ మందులను వాడడం వలన తలనొప్పి, వికారం, రొ!మ్ముల్లో సున్నితత్వం, ఉబ్బరం, మరియు కొన్ని మానసిక మార్పులు కూడా కలగవచ్చు. కొన్ని మందులు ఋతుచక్రం రక్తస్రావం నమూనాలతో కూడా మార్పులను తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఇలాంటి వాటిని వాడకపోవడమే మంచిది. వీటిల్లో కొన్ని మందులు హార్మోనల్ ఇంబ్యాలన్సు కు కారణం అయ్యి.. కొన్ని నెలల పాటు ఇర్రేగులర్ పీరియడ్స్ రావడానికి కారణం అవుతాయి.
- Disclaimers: The images shown are for illustration purposes only and may not be an exact representation of the product.
మరిన్ని..
Sardine Fish in Telugu: సార్డిన్ చేప గురించి ఈ విషయాలు తెలుసా?
Matti Katha OTT Movie: ఆహాలో ప్రసారం కాబోతున్న ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా “మట్టి కథ..”!
Halim Seeds: Benefits Uses, Side Effects హలీం గింజలు అంటే ఏమిటి?