Advertisement
Viluva Quotes and Quotations in Telugu/ విలువ కొటేషన్స్ మరియు కోట్స్ : సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్నిరోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేనన్నీ కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంటుంది. కొందరూ వయస్సు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయస్సు పెరిగే కొద్ది కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరుగదు. వయస్సు పెరుగుతుంటే మనం ఎన్నో గుణపాఠాలు, అనుభవాలను మాత్రం తప్పకుండా నేర్చుకుంటూ ముందుకెళ్తాం.
Advertisement
వీటిని కూడా చదవండి: మీ బంధు మిత్రులకి వివాహ శుభాకాంక్షలు ఇలా తెలియచేయండి
ఈ నేపథ్యంలోనే మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి.. అదేవిధంగా భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువను.. మనలను మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని సానుకూలతను పెంపొందించుకోవడం అవసరం. ఈ అవసరాన్ని బట్టి గుర్తు చేసుకునే మంచి లైఫ్ కొటేషన్స్.. నిత్యం ఇలాంటి తెలుగు కొటేషన్లు చదువుకోవడంతో పాటు, వాటిని మనం షేర్ చేసుకోవడం వల్ల మన జీవితంలో సరికొత్త ఆనందం, స్ఫూర్తి కలుగుతుంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ తెలుగు కొటేషన్స్ గురించి తప్పక తెలుసుకోండి.
వీటిని కూడా చదవండి: Best Samethalu in Telugu
Advertisement
Best Viluva Quotes and Quotations in Telugu
- మౌనం ఎవ్వరికైతే విలువ ఇస్తామో వారి విషయంలో మనం చాలా చౌకగా కనిపిస్తాం.
- అర్థ రహిత మాటల కన్నా కూడా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
- తనవరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం.
- బంధం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. చేజార్చుకున్నక విలువ తెలిసిన ప్రయోజనంలేదు.
- నీకు కుదిరినప్పుడు కాదు. ఎదుటవారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు.బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం అస్సలు కలుపుకోకు.
- జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం.
- ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి.
- తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
- సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
- జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు.
- తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు.
- సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు..
- జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది.
- ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
Viluva Quotes Images in Telugu Text