Advertisement
ఇటీవల ప్రశాంతత కోసం గుడికి వెళ్లే వారి జాబితా కూడా ఎక్కువే అవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో పది నిమిషాల సమయం గుడిలో గడిపితే ఎంతో ప్రశాంతతని పొందుతూ ఉంటారు. సాధారణంగా చాలా మంది గుడికి వెళ్లే ముందు ఏమీ తినకుండానే వెళ్తుంటారు. కానీ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహరం తినేసి ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటారు. అయితే.. ఇలా ఆహరం తీసుకుని గుడికి వెళ్లే వారు కొన్ని నియమాలను చూసుకోవాలి.
Advertisement
హిందూ దేవాలయాలలు దేశంలో సందుకొకటి ఉంటాయి. అయితే.. అన్ని దేవాలయాలు వైదిక దేవాలయాల కిందకి రావు. వేటినైతే నియమానుసారం నిర్మించి, నిత్య అనుష్టానాలు జరుపుతూ ఉంటారో వాటిని వైదిక దేవాలయాల కింద పేర్కొంటారు. అయితే.. ఇటువంటి దేవాలయాలకు వెళ్లే ముందు మీరు తీసుకునే ఆహరంలో గుడ్డు, మాంసం లాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి తమో, రజో గుణాలను కలిగిస్తాయి. ఫలితంగా కోపం, ఉద్రిక్తం లాంటి భావాలు అధికం అయ్యి ప్రశాంతతని కోల్పోతాము.
Advertisement
గుడికి వెళ్లిన సమయంలో ఉండాల్సిన మొట్టమొదటి గుణం సత్వ గుణం. కానీ మాంసాహారం తీసుకోవడం వలన అది లోపిస్తుంది. గుడికి వెళ్లినా ప్రయోజనం ఉండదు. గుడ్డు, మాంసాహారం కాకుండా ఉల్లి, వెల్లుల్లి వంటి మసాలా దినుసుల వలన కూడా తమో రజో గుణాలు ఎక్కువ అవుతాయి. అందుకే గుడికి వెళ్లే ముందు వీలైనంత వరకు పళ్ళు, కూరలు వంటి సాత్విక ఆహారాలను తీసుకోవడమే మంచిది. నిజానికి చాలా మంది హిందువులు గుడికి వెళ్లేముందు ఏ ఆహారాన్ని తీసుకోరు. ఖాళీ కడుపుతోనే దర్శనం చేసుకుంటారు. ఆ సమయంలో వచ్చే ప్రశాంతతకు, తిన్న తరువాత దర్శనం చేసుకోవడం వలన కలిగే ఫీలింగ్స్ కు చాలా తేడా ఉంటుంది. ఖాళి కడుపుతో దర్శనం చేసుకుని.. ఆ తరువాత అక్కడ ఇచ్చే ప్రసాదం తింటే ఒక రకమైన మానసిక అనుభూతి కలుగుతుంది.
మరిన్ని..
మోహన్ బాబు వల్ల హీరో అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు?
అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు !
10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!!