Advertisement
చంద్రబాబు గతంలో తీసుకున్న క్వాష్ పిటిషన్ పై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి సుప్రీం కోర్ట్ ఎక్కువ కాలం తీర్పుని రిజర్వ్ చెయ్యదు. అందుకే శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తీర్పు ఎలా ఉన్నప్పటికీ టీడీపీ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఓ వైపు కోర్టు వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు ప్రజల్లోనూ ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Advertisement
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసాక చాలా మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు మృతి చెందారు. భువనేశ్వరి వీరందరి కుటుంబాలను కలిసి ఓదార్పు ఇవ్వనున్నారు. నిజం గెలవాలి పేరుతొ ఓదార్పు యాత్ర చేయనున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులేనని.. తీర్పు ఎలా వచ్చినా ఈ యాత్రని మాత్రం కొనసాగిస్తామని భువనేశ్వరి స్పష్టం చేసారు. అలాగే.. మహానాడు సమయంలోనే టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు భావించారు. అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు.
Advertisement
అయితే.. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతొ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటికి కూడా లోకేష్ బాధ్యత తీసుకోనున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్న సమయంలోనే చంద్రబాబుని తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. అందుకే భవిష్యత్ కు గ్యారంటీ పేరుతొ ఈ కార్యక్రమాన్ని లోకేష్ నిర్వహించనున్నారు. ఇవి కాకుండా గతంలో లోకేష్ యువగళంతో కూడా ప్రజల్లోకి వెళ్లేవారు. ప్రస్తుతం పరిణామాల దృష్ట్యా ఆయన ఈ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. అయితే చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యి, కొంత విశ్రాంతి తీసుకున్నాక లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మరిన్ని..
Leo 2023 Review in Telugu: దళపతి విజయ్ లియో మూవీ రివ్యూ & రేటింగ్ !
Bhagavanth Kesari Review: నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమా రివ్యూ అండ్ రేటింగ్ !