Advertisement
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గెలుపు ఎవరికీ సొంతం అవుతుంది? అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తెలంగాణాలో విజయకేతనం ఎగురవేసే పార్టీ ఎవరిదీ? అన్న విషయమై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. అయితే.. ఓటర్ల మనసులో ఏమి ఉంది? అన్న విషయాన్నీ కనిపెట్టడానికి ఓ వైపు మీడియా సంస్థలు మరో వైపు సర్వేలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణాలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. అయితే.. ఒపీనియన్ పోల్ లో తేలింది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇటీవల విడుదల అయిన సర్వే ఫలితాలలో కాంగ్రెస్ మొత్తం 119 స్థానాల్లో 54 స్థానాలు గెలుపొందుతుందని తేలింది. మ్యాజిక్ మార్క్ అని 60 స్థానాలను పేర్కొంటారు. ఈ మార్క్ కి రీచ్ అవ్వాలి అంటే కాంగ్రెస్ మరో ఆరు స్థానాలను గెలవాల్సిన అవసరం ఉంది. ఇక బిఆర్ఎస్ రెండవ స్థానంలో ఉందని.. వారికి 49 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మిగతా పార్టీలకు 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Advertisement
బిఆర్ఎస్ కు ఎంఐఎం తో పొత్తు ఉంది. ఈ లెక్కన ఎంఐఎం కు ఓ ఏడు స్థానాలు దక్కినా ఈ రెండు పార్టీల స్థానాలను కలుపుకుంటే 56 మాత్రమే అవుతాయి. ఇలా చూసుకున్నా బిఆర్ఎస్ కు మ్యాజిక్ మార్క్ రాలేదు. దీనిని బట్టి ఎన్నికలకు ఇంకా నలభై రోజుల గడువు ఉంది కాబట్టి పార్టీలు ఇంకా విస్తృత ప్రచారం చేయవచ్చని తెలుస్తోంది. ఈ నలభై రోజుల్లో పార్టీలు చేసుకునే ప్రచారాలు, ఇచ్చే హామీలు కూడా రాబోయే ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని తెలుస్తోంది. అయితే.. ఈ సర్వేనే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ఐడియా రావడం కోసం మాత్రమే ఈ సర్వే ఉపయోగపడుతుంది.
మరిన్ని Telugu news మరియు AP రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి !