Advertisement
చిన్న వయసులోనే స్టార్ హీరో గా ఎదిగిన ఉదయ్ కిరణ్.. పైకొచ్చినంత తొందరగానే పైకెళ్లిపోయాడు. ఆయుష్షు ఉండగానే బలవంతంగా ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే.. ఆయనని మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలలో మోగుతూనే ఉంటాయి. ‘మనసంతా నువ్వే’, ‘చిత్రం’ ‘నువ్వు నేను’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా దూసుకొచ్చిన ఉదయ్ కిరణ్ అప్పటి స్టార్ హీరోలకు తలదన్నే పోటీ ఇచ్చాడు.
Advertisement
అయితే.. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం ఆగిపోవడంతో తెరమరుగయ్యారు. అయితే.. ఒక దశలో మెగాస్టార్ చిరంజీవి తన కూతురుని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి వివాహం చేయాలనీ కూడా అనుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అనుకోని కారణాల వలన ఈ వివాహం ఆగిపోయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ విషితనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరో వైపు అవకాశాలు కూడా తగ్గుతుండడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని, అదే అతన్ని బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేసిందని చెబుతుంటారు.
Advertisement
ఇటీవల ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తన తమ్ముడి చావుకి ఆర్ధిక సమస్యలు కారణం కాదన్నారు. అంత కర్మ నా తమ్ముడికి లేదని.. అతనికి కావాల్సినంత ఆస్థి ఉందని అన్నారు. అతని భార్య విషిత మాత్రం మాకు దూరంగా ఉంటుందని.. కలుపుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవలేదని అన్నారు. కొత్త అనుమానాలు రేకెత్తించడంతో పాటు.. ఉదయ్ కిరణ్ ఆస్తులను కూడా ఆమె తీసుకుందని శ్రీదేవి చెప్పుకొచ్చారు. తనపై ఇన్ని నిందలు పడుతున్నా.. ఉదయ్ భార్య విషిత మాత్రం స్పందించడం లేదు. జరిగిపోయిన విషయాల గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడి మనసుని పాడు చేసుకోవడం ఇష్టం లేకే ఆమె ఇన్నాళ్లూ మౌనం వహిస్తోంది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
మరిన్ని..
రజినీకాంత్ తెర వెనుక అంత సింపుల్ గా ఎందుకు ఉంటారో తెలుసా? అసలు కారణం ఇదే..!
ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ ఆర్టిస్టులు అందరూ చనిపోయారని తెలుసా ? వారెవరంటే ?
పాక్ జట్టు నుండి పెద్ద హిట్స్ లేకపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన పాక్ ఓపెనర్..!