Advertisement
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2003 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు, రాజమౌళి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
Advertisement
ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ₹8.5 కోట్ల బడ్జెట్తో నిర్మించబడ్డ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ₹26 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కన్నడలో, తమిళంలో, బెంగాలీలో కూడా రీమేక్ చెయ్యబడింది.
ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ నాజర్ ఇంట్లో ఉంటూ ఉంటాడు. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల బంధం ఉంటుంది. కానీ, ఎన్టీఆర్ కు ఎవ్వరికి తెలియని ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎవ్వరికి తెలియకుండా అతను ఇందు అనే ఓ మానసిక వికలాంగురాలిని కలిసి వస్తూ ఉంటాడు. ఆమెకి ఏమి కావాలో చూసుకుంటూ ఉంటాడు. కానీ, ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని, ఎన్టీఆర్ కోసం గ్యాంగ్ స్టర్లు వెదుకుతూ ఉంటారని సినిమా స్టార్టింగ్ లో మనకెవ్వరికీ తెలియదు.
Advertisement
అయితే.. సస్పెన్స్ రివీల్ అయ్యి గ్యాంగ్ స్టర్ లు అందరు వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో శరత్ సక్సేనా నటించారు.
ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్ని విషయాలు తెలుసు. అయినా సరే.. ఓ వైపు విలన్ గ్యాంగ్ వెతుకుతూ ఉంటె.. ఇంకోవైపు ఈయన కూడా సింహాద్రి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు నెటిజన్స్ .. ఇతను ఓ పోలీస్ ఆఫీసర్ కదా… హీరోయిన్ ఫ్యామిలీకి ఫ్రెండ్ కూడా. హీరోయిన్ వాళ్ళ ఊరు వెళ్తే హీరో గురించిన వివరాలు తెలుస్తాయి కదా.. అసలు ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.. ఈ విషయం మనకి అప్పుడు తట్టలేదు. కానీ, లాజిక్ ప్రకారం ఇది కరక్టే కదా.