Advertisement
బిటెక్ చదివిన ప్రతి కుర్రాడు ఇంజనీర్ అవ్వాలి అని ఎన్నో కలలు కంటుంటారు. అందులోనూ ఓ పెద్ద కంపెనీలో ఇంజనీర్ గా జాబ్ వస్తే మాత్రం లైఫ్ లో సెటిల్ అయిపోయినట్లేనని అనుకుంటూ ఉంటారు. కానీ.. డబ్బు సంపాదించడం కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయని కొన్ని అనుభవాలు పాఠం నేర్పిస్తాయి. అలాంటి అనుభవమే ఈ ఇంజనీర్ కి కూడా ఎదురైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రముఖ సంస్థ L&T లో ఇంజినీరు. అతని భార్య ఓ సారి గర్భస్రావానికి గురి అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. గర్భవతిగా ఉన్న ఆమె అనుకోకుండా గర్భస్రావం అవడంతో బిడ్డని కోల్పోయారు. ఆ సమయంలో హాస్పిటల్ కి వెళ్ళడానికి కూడా టాక్సీ దొరకలేదు.
Advertisement
దీనితో ఈ వ్యక్తి చాలా బాధపడ్డారు. ఇటువంటి పరిస్థితి మరొకరికి రాకూడదని అనుకున్నారు. అందుకే ఇంజనీరుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి.. టాక్సీ డ్రైవర్ గా కొత్త అవతారం ఎత్తారు. తన క్యాబ్ లో ఎక్కినా ప్రతి ఒక్కరికి ఒక కార్డు ని అందిస్తారు. ఏ సమయంలో అయినా అవసరం అయితే ఫోన్ చేసి క్యాబ్ కోసం పిలవచ్చని తన ప్రయాణికులకు చెబుతుంటారు. “నేను సాధారణ ప్రయాణీకుల నుండి నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తాను, కానీ నా లక్ష్యం రోజులో ఏ గంటలోనైనా అవసరమైన వారికి సహాయం చేయడమే” అని ఆయన చెబుతుంటారు.
Advertisement
నేను ఈ పనిని కొనసాగించడానికి ప్రేరేపించిన ఘటన మరొకటి ఉంది. ఓసారి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఓ మహిళా పిచ్చి పట్టినట్లు క్యాబ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమెతో పాటు ఉన్న మరో మహిళకు కాలిన గాయాలు అయ్యాయి. దాదాపు 75 శాతం శరీరం కాలిపోయింది. నా కంటే ముందు వచ్చిన డ్రైవర్లు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంగీకరించలేదు. నేను నా కారులో ఉంచుకునే దుప్పటిని వారికి ఇచ్చి, ఆమెను కప్పి ఉంచమని కోరాను మరియు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకురావడానికి చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేశాను. ఆ తరువాత కూడా ఆమె బతికి ఉందొ లేదో కూడా చెక్ చేస్తూనే ఉన్నాను. దేవుని దయ వలన ఆమె బయటపడింది. ఇప్పుడు వారు నాకు మంచి స్నేహితులు కూడా. జూలై 26న వరదల సమయంలో కూడా ఇలానే గమ్య స్థానాలకు చేర్చాను. నేను ఇంజనీర్ గా పని చేసినప్పుడు 65000 రూపాయలు సంపాదించాను. కానీ ఇప్పుడు నా సంపాదన తక్కువైనా.. ఇప్పుడు ఉన్నంత సంతోషంగా ఎప్పుడూ లేను అని ఈయన చెబుతుంటారు. నా వయస్సు 74 సంవత్సరాలు, 11 భాషలు మాట్లాడగలను, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో పని చేసే పిల్లలు మరియు అడ్వాన్స్డ్ ఇంజనీర్ కావడానికి అర్హత కలిగి ఉన్నాను…కానీ నా జీవితంలో హైలైట్ ఏమిటంటే, ఈ రోజు వరకు నేను 500 కంటే ఎక్కువ ఎమర్జెన్సీ కేసులను సకాలంలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. నన్ను ఓ ఇంజనీర్ గా కంటే.. టాక్సీ డ్రైవర్ అని పిలిస్తేనే నేను గర్వంగా ఫీల్ అవుతాను.
Venkatesh Daughter Engagement: వెంకటేష్ చిన్న అల్లుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయనకు 30, ఆమెకు 42..ఎర్రగా ఉందని ఆశపడ్డాడు..గూగుల్ లో సెర్చ్ చేసి మరీ అలా చేశాడు..!!