Advertisement
హైదరాబాద్ చంపాపేట్ వద్ద ఎన్టీఆర్ నగర్ కాలనిలో ఓ అమ్మాయిని హ*త్య* చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపిన సంగతి విదితమే. అయితే.. అదే సమయంలో మరో అబ్బాయి రెండంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి పడ్డాడు. దీనితో.. స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Advertisement
అసలు ఏం జరుగుతోందో అని భయబ్రాంతులకు గురి అయ్యారు. ఈ కేసుని పోలీసులు ఛేదించారు. స్వప్నని ఆమె భర్తే హ!త్య చేసారని పోలీసులు వివరించారు. వివాహేతర సంబంధం వలనే ఆమెని భర్త హ!త్య చేసారు.
భర్త ఇంటికి వచ్చేసరికి స్వప్న, ఆమె ప్రియుడు సతీష్ తో కలిసి హాల్ లో కనిపించడంతో భర్త ప్రేమ్ ఆగ్రహం తెచ్చుకున్నారు. ఈ సమయంలోనే వారిద్దరికీ గొడవ జరిగింది. ఆగ్రహించిన ప్రేమ్ స్వప్నను కత్తి తీసుకుని గొంతు కోశారు. దీనితో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. ఆ తరువాత ప్రేమ్ కు, సతీష్ కు మధ్య వాగ్వాదం నడించింది. సతీష్ ప్రేమ్ పై దాడి చేసి.. బిల్డింగ్ పై నుంచి తోసేశారు. అక్కడినుంచి సతీష్ పారిపోయాడు. సతీష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రేమ్ మాత్రం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు.
Advertisement
స్వప్న మహబూబ్నగర్ హన్వాడ తండాకు చెందిన వర్త్య మోహన్ కు కుమార్తె. నల్లగొండ జిల్లా వాసి హన్మంతు అనే వ్యక్తి, స్వప్న కలిసి ఎనిమిది నెలల క్రితం అన్నా చెల్లెళ్లమని చెప్పి ఎన్టీఆర్ నగర్ కాలనిలో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం స్వప్నకు మహేశ్వరంలో టీ పాయింట్ నడుపుకునే ప్రేమ్ తో వివాహం అయ్యింది. వీరు కలిసే ఉంటున్నారు. శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో రెండవ అంతస్తు నుంచి ప్రేమ్ కుమార్ కిందపడ్డాడు. దీనితో ఏమైందో అని ఇంటి ఓనర్ వెళ్లి చూసేసరికి ప్రేమ్ కనిపించాడు. అదే టైం లో మెట్లు దిగి ఇద్దరు యువకులు వెళ్లిపోయారు. పైకి వెళ్లి చూస్తే.. స్వప్న రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె తండ్రి మోహన్ కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ కేసుని ఛేదించారు.
Venkatesh Daughter Engagement: వెంకటేష్ చిన్న అల్లుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయనకు 30, ఆమెకు 42..ఎర్రగా ఉందని ఆశపడ్డాడు..గూగుల్ లో సెర్చ్ చేసి మరీ అలా చేశాడు..!!