Advertisement
Millets in Telugu: చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది ఈ మధ్యకాలంలో అన్నాన్ని తినడం మానేసి, చిరుధాన్యాల తినడానికి చూస్తున్నారు. చిరుధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడానికి మనకి ఈ చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనకి కావాల్సిన అనేక పోషకాలని ఇవి అందిస్తాయి. చిరుధాన్యాలు లో డైట్రి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
Advertisement
మెరుగైన జీవన వ్యవస్థ పనితీరు కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. చిరుధాన్యాలలో పీచు పదార్థం పేగు కదలికలని మెరుగుపరుస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు చిరుధాన్యాలని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు తగ్గిపోతాయి చిరుధాన్యాలను తీసుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. మధుమేహం కూడా కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి.
Advertisement
పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటి నుండి మనల్ని బయటపడేస్తాయి. శక్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి కండరాల వ్యవస్థని బలోపేతం చేయడానికి కూడా చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. విటమిన్స్, ఖనిజాలు, ఆమ్లాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలలో టానిన్ అనే ఫినోలిక్ పదార్థం ఎక్కువ ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
చిరుధాన్యాలు పేర్లు ఇంగ్లీష్ మరియు తెలుగులో:
- Pearl Millets/ Bajra Millet , Sajjalu (సజ్జలు)
- Great Millet/Sorghum , Jonna (జొన్న)
- Finger Millets, Ragulu (రాగులు)
- Proso Millets, Varagalu (వరిగలు)
- Kodo Millets, Arikalu (అరికలు)
- Foxtail Millets/Italian millet, Korralu (కొర్రలు)
- Little Millets, Samalu (సామలు)
- Barnyard Millets, Oodalu/Kodisama (ఊదలు, కొడిశమ)
- Browntop Millets, Andu korralu (అండు కొర్రలు)