Advertisement
ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలిసుల బందోబస్తు కూడా పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ నగదు, లిక్కర్ వంటి వాటిని తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు. పోలీసులు ప్రతి చోట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి కార్ ని తనిఖీ చేస్తున్నారు. తాజాగా.. కేటీఆర్ కార్ ని కూడా వదల్లేదు. మంత్రి కేటీఆర్ కూడా పోలిసుల తనిఖీకి సహకరించారు.
Advertisement
పోలీసులు, ఎన్నికల అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. ఒక ప్రకటనలో, ఎన్నికల సమగ్రతను నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు మరియు ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని రాజకీయ నాయకులందరినీ కోరారు. సామాన్య ప్రజల నుంచి, రాజకీయ నేతలు వరకు ప్రతి ఒక్కరు తనిఖీలకు సహకరించాల్సిందే.
Advertisement
తాజాగా కేటీఆర్ కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద కేటీఆర్ వాహనాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తరువాత కారులో వాటర్ బాటిల్స్ తప్ప ఇంకేమీ లేవని పోలీసులు వెల్లడించారు. తనిఖీలు పూర్తి అయ్యాక కేటీఆర్ తిరిగి కామారెడ్డికి వెళ్లారు. ఈ సారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ తరపున కామారెడ్డిలో ప్రచారం చేయడానికి వెళ్లారు.
మరిన్ని..
చంద్రబాబు నాయుడు ను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
Tollywood Star Hero’s: మన 6 స్టార్ హీరోలు డెబ్యూట్ అవ్వాల్సిన సినిమాలు కానీ ! కానీ మిస్ అయ్యారు !
Suryakantham: సీనియర్ నటి సూర్యకాంతాన్ని రీప్లేస్ చేయగలిగిన ప్రెజెంట్ జనరేషన్ నటి ఎవరో తెలుసా?