Advertisement
మనజీవితంలో కొన్ని విషయాలు యాదృచ్చికంగా జరిగి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటివి సెలెబ్రిటీల జీవితంలో జరిగితే.. అందరు వాటి గురించే చర్చిస్తూ ఉంటారు. ఇక సినీ నటి లావణ్య జీవితంలో కూడా ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనలు జరిగాయి. వాటిల్లో మొదటిది వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడం. చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు లావణ్య గారి గురించి ఓ మాట అన్నారు. ఇక్కడే సెటిల్ అయిపోయి.. మంచి తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని. కానీ ఆ క్షణం ఆమె కూడా ఊహించి ఉండరు. యూపీలో పుట్టి పెరిగిన తాను.. ఇలా ఓ తెలుగు అబ్బాయితో.. అది కూడా ఆ మాటలు అన్న అల్లు అరవింద్ ఫ్యామిలీ కి చెందిన అబ్బాయితో తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అని అస్సలు అనుకుని ఉండరు.
Advertisement
కానీ లావణ్య జీవితంలో అదే నిజం అయింది. అంతే కాదు.. మరొకటి కూడా లావణ్య జీవితంలో యాదృచ్చికంగా జరిగింది. లావణ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ కి “అందాల రాక్షసి” సినిమాతో పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లావణ్యకి పెళ్లి కుదిరినప్పుడు కొందరు చిన్న పిల్లలు ఆమె చుట్టూ చేరి ఆటపట్టిస్తారు. అక్కా.. నీ పెళ్ళికి సినిమా వాళ్ళు వస్తున్నారంట కదా.. చిరంజీవి కూడా వస్తారా? అని అడుగుతారు.
Advertisement
దానికి లావణ్య హా..అవును. అని సమాధానం ఇస్తుంది. ఆ పిల్లలంతా హే అనుకుంటూ ఆమెని ఆట పట్టించి అక్కడనుంచి వెళ్ళిపోతారు. ఈ సినిమా ఎప్పుడో 2012 లో వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం తరువాత అదే నిజం అయ్యింది. ఆమె పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇంకా ఆమె ఆయనకు కోడలి వరస కూడా అయ్యింది. ఇదంతా ఆమె ఆ సినిమా సమయానికి ఊహించి ఉండరు. కొన్ని యాదృచ్ఛికాలు జరిగి మనల్ని తీరని ఆశ్చర్యంలో ముంచెత్తేస్తూ ఉంటాయి. ఇలాంటిదే అది కూడా. ఏది ఏమైనా మొత్తానికి లావణ్య కొణిదెల ఫ్యామిలీ కోడలు పిల్ల అయిపోయింది.
లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో ఒక సన్నివేశం.
కట్ చేస్తే… పదకొండేళ్ల తర్వాత తన పెళ్ళికి చిరంజీవి వచ్చాడు!!#VarunTej #LavanyaTripathi #VarunLav #Chiranjeevi #AndalaRakshasi pic.twitter.com/9x8RaYJ2SY— Gulte (@GulteOfficial) November 3, 2023
మరిన్ని..
Keeda Cola Telugu Review : కీడా కోలా రివ్యూ !
Narakasura Movie Telugu Review : నరకాసుర మూవీ రివ్యూ.. ట్విస్ట్ లు మాములుగా లేవుగా.. మైండ్ బ్లాక్..!
Vidhi Movie Telugu Review: విధి మూవీ రివ్యూ ఇదే.. సినిమా హిట్టా? ఫట్టా?