Advertisement
ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన షణ్ముఖ నాయక్, రవణమ్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. రావణమ్మ ఉరవకొండ మండలం వెంకటంపల్లి తండాకు చెందిన అమ్మాయి. వీరిద్దరూ కొంతకాలం కలిసి తిరిగిన తరువాత విబేధాలు వచ్చాయి. రెండు ఫామిలీస్ మధ్య గొడవలు కూడా అయ్యాయి. రాజీలు కుదరలేదు. ఇద్దరు విడిపోయారు. అయితే.. రీసెంట్ గా షణ్ముఖ నాయక్ తిరుపతిలో ఉంటున్నాడు. కాగా రమణమ్మ కర్నూల్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటోంది.
Advertisement
ఓ రోజు అనుకోకుండా తిరుపతి నుంచి షణ్ముఖ్ కర్నూల్ లో రమణమ్మ దగ్గరకు వచ్చాడు. అయితే.. జరిగింది ఏమిటో తెలియదు. కానీ షణ్ముఖ్ ఉరి వేసుకుని చనిపోయాడని.. అతని మృతదేహం హాస్పిటల్ లో ఉంది రమ్మంటూ రమణమ్మ షణ్ముఖ్ పేరెంట్స్ కు ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలిసిన షణ్ముఖ్ పేరెంట్స్ వెంటనే హాస్పిటల్ కు వచ్చారు. రమణమ్మ ఆమె పేరెంట్స్ కలిసే షణ్ముఖ్ ని చంపారని మృతుడి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
Advertisement
అయితే.. రమణమ్మ మరో ముగ్గురు కలిసి షణ్ముఖ్ మృతదేహాన్ని హాస్పిటల్ లో వదిలేసి వెళ్లారని ఆరోపిస్తున్నారు. శవ పరీక్షా చేయడానికి రమణమ్మ సంతకం అడుగుతున్నారని.. కానీ ఆమె పరారీలో ఉందని చెబుతున్నారు. అసలు ఈ కేసులో ఏమి జరిగిందో, తమ కుమారుడు ఎలా చనిపోయాడో.. పూర్తి స్థాయిలో విచారణ చేసి, దర్యాప్తు చేయాలనీ బాధితులు ర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసారు.
Read More:
ఆరు పదుల వయసులో ఒక్కటయ్యారు… అందరు ఇలానే ఆలోచిస్తే బాగుంటుందేమో..!
అయ్యప్ప మాల వేసుకున్న వారు నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? అసలు కారణం ఏంటంటే?
ప్రియుడిని ఇంటికి పిలిచింది.. దొరికిపోయేసరికి ప్లేట్ మార్చి, చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత?