Advertisement
కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు అక్రమ సంబంధం ఉంది అని అనుమానించిన ఓ పోలీస్ కానిస్టేబులు ఆమెను హ*త్య* చేసి ఆ తరువాత అతను కూడా ఆ*త్మ*హ*త్య చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. అతని భార్య ఇప్పటికే మరణించగా.. అతను మాత్రం పురుగుల మందు తాగడం వలన చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ రెండు ఘటనల కంటే అత్యంత విషాదకరమైన ఘటన ఏంటంటే.. వీరిద్దరికీ పదకొండు రోజుల క్రితమే ఒక బాబు జన్మించాడు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
Advertisement
వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకకు చెందిన కిషోర్ , ప్రతిభ లకు నవంబర్ 13 2022 న వివాహం జరిగింది. అయితే.. కిషోర్ కు భార్యపై చాలా అనుమానం ఉండేది. ఆమెకు వచ్చే కాల్స్, మెసేజిలను తరచుగా చెక్ చేస్తూ ఉండేవాడు. ఆమెకు కాలేజీలో స్నేహాలు ఎక్కువేనని ఫిర్యాదులు కూడా చేసేవాడట. ఆదివారం సాయంత్రం రోజు కిషోర్ ఫోన్ చేసి ప్రతిభను తిట్టడంతో ఆమె ఏడుస్తూ ఉంది. దీనితో ఆమె తల్లి ఫోన్ తీసుకుని కాల్ ని డిస్ కనెక్ట్ చేసింది. ఈ గొడవల ప్రభావం బిడ్డ ఆరోగ్యంపై కూడా పడే అవకాశం ఉందని, కిషోర్ కాల్స్ కు ఆన్సర్ చేయవద్దని ఆమె చెప్పింది.
Advertisement
ఆ తరువాత సోమవారం రోజు కిషోర్ ప్రతిభకు 150 సార్లు ఫోన్ చేసాడని ప్రతిభ తల్లితండ్రులు తెలిపారు. ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపం తెచ్చుకున్న కిషోర్ ఇంటికి వచ్చి ఆమె ఉన్న గది లోపలకు వెళ్లి తలుపు వేసాడు. అతను పురుగుల మందు తాగి ఆపై ప్రతిభకు ఫ్యాన్ కు ఉరి వేసాడు. ప్రతిభ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనుమానం వచ్చిన ప్రతిభ తల్లితండ్రులు డోర్ బాదగా.. తలుపు తీసి ఆమెను నేను చంపేసాను అంటూ కిషోర్ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కిషోర్ కూడా పురుగుల మందు ప్రభావంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.
Read More:
పాక్ సెమీస్ కు వస్తే ముంబైలో ఆడదు.. బీసీసీఐ స్పష్టం.. ఎందుకంటే?
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్
Motivational Bible Quotes in Telugu and తెలుగు బైబిల్ కోట్స్