Advertisement
మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఇద్దరు ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి ఇటీవలే ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుకను కూడా చేసుకున్నారు. పెళ్లి అయ్యి ఇంకా పది రోజులు కాలేదు.. సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ ఫోటోల హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉండగానే.. వరుణ్ తేజ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అతను తీసుకున్న డెసిషన్ కి మెగా ఫామిలీ కూడా షాక్ లో ఉందట. అప్పుడే లావణ్యకి హ్యాండ్ ఇచ్చావా అంటూ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ పై కామెంట్స్ కనిపిస్తున్నాయి.
Advertisement
ఇంతకీ వరుణ్ తేజ్ తీసుకున్న అంత షాక్ అయ్యే డెసిషన్ ఏంటంటే.. పెళ్ళై పది రోజులు కూడా కాకుండా షూటింగ్స్ కు వెళ్ళిపోయాడట. వీరిద్దరూ దాదాపు ఐదేళ్లు సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటున్నాం అంటూ వారి అభిమానులకు సడన్ షాక్ ఇచ్చారు. అయితే.. వీరి జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ హనీమూన్ ప్లాన్ చేసుకోకుండా.. షూటింగ్ ప్లాన్ చేసుకోవడం ఏంటండి..? లావణ్య కి హ్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాల్లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమా “గాండీవధారి అర్జున” కు బాగానే హైప్ వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రం రాలేదు. అయితే.. పెళ్లి తరువాత ఫుల్ మోడ్ లో సినిమాలు చెయ్యాలి అని వరుణ్ తేజ్ ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయి లోనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్లు పడనున్నాయి.
Read More:
Japan Movie Review: జపాన్ లో కార్తీ అదరకొట్టేసాడా..? జపాన్ హిట్టా, ఫట్టా..?
Maa Oori Polimera 2 OTT: Release Date and Platform Details When And Where To Watch the Movie
Japan Movie Twitter Reviews: జపాన్ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది ? ప్రేక్షకులు ఏమంటున్నారు ?