Advertisement
షమీ ఇండియన్ జట్టులో స్టార్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు అతని లైఫ్ లో ఓ కొత్త అమ్మాయి వచ్చింది అంటూ నెట్టింట్లో న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కొత్త అమ్మాయి రావడం వల్లే వరల్డ్ కప్ లో షమీ రాణిస్తున్నదని, అతని తలరాతే మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన అన్నిటిలోను విజయం సాధించింది. లీగ్ స్టేజి లో చివరగా నెదర్లాండ్స్ తో భారత్ పోటీ పడనుంది.
Advertisement
ప్రస్తుతం టీం ఇండియా భీకరంగా పోరాటం చేస్తోంది. ఇక బ్యాటర్స్ ఎంత కష్టపడుతున్నారో.. బౌలర్లు కూడా అంతే ఫామ్ లో ఉండి కష్టపడుతున్నారు. వారిలో షమీ కూడా ఉన్నాడు. బౌలర్ల మీద నమ్మకంతోనే ఇండియన్ బ్యాటర్స్ అంత స్వేచ్ఛగా ఆడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఇక మహ్మద్ షమి వచ్చాక దశ తిరిగిందని చెప్పొచ్చు. అతని ధాటికి బ్యాట్స్ మెన్ అదిరిపోతున్నారు కూడా. షమీ మోస్ట్ డేంజరస్ బౌలర్ గా మారాడు. అతను బౌలింగ్ చేస్తుంటే.. ప్రతి బాల్ కు వికెట్ పడుతుందేమో అన్నట్లు ఉంటుంది. అతని బౌలింగ్ గతంలో కంటే బాగా ఇంప్రూవ్ అయ్యిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతని జీవితంలోకి ఓ కొత్త అమ్మాయి వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ నే షమీ లైఫ్ లోకి వచ్చిందని అంటున్నారు.
Advertisement
ఈమె ఎన్టీఆర్ “ఊసర వెల్లి” సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించారు. పాయల్ ఘోష్ నే షమీకి ప్రపోజ్ చేసిందని అంటున్నారు. అయితే.. తన ఇంగ్లీష్ ను ఇంప్రూవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టిందట. ఇందులో నిజం ఎంత ఉందొ తెలియాల్సిందే. సెమి ఫైనల్స్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి తన నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అంటూ పాయల్ ఘోష్ షమిని ట్విట్టర్ లో కోరింది. టీం ఇండియా ఫైనల్స్ లో ప్లేస్ కొట్టాలని, అక్కడ షమీ హీరోగా నిలిస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చింది. పాయల్ షమీతో ప్రేమలో పడిందా.. లేక ఇది పబ్లిసిటీ స్టంట్ నా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పాయల్ ఇచ్చిన ఆఫర్ ని మైండ్ లో పెట్టుకునే షమీ బౌలింగ్ లో తన ప్రతాపం చూపిస్తున్నాడని.. ఆమె రాక వరల్డ్ కప్ లో అతని తలరాతని మార్చిందని అంటున్నారు.
Read More:
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్
పెళ్ళైన పది రోజులకే షాకింగ్ డెసిషన్ తీసుకున్న వరుణ్ తేజ్.. అసలేమైందంటే?
Japan Movie Review: జపాన్ లో కార్తీ అదరకొట్టేసాడా..? జపాన్ హిట్టా, ఫట్టా..?