Advertisement
క్రికెట్ ప్రపంచంలో రాచిన్ సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడంలో రాచిన్ ది కీలక పాత్ర. 23 ఏళ్ల అతను తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 70.62 సగటుతో 565 పరుగులు చేశాడు, మూడు సెంచరీలు మరియు రెండు అర్ధసెంచరీలు చేశాడు. అయితే.. రాచిన్ తన టాలెంట్ కి మాత్రమే కాదు.. తన పేరుకి కూడా పాపులర్ అయ్యారు. అతని తల్లిదండ్రులు పెద్ద క్రికెట్ అభిమానులు కావడంతో అతని పేరు ఇద్దరు లెజెండ్‌ల నేమ్ కలిసి వచ్చేలా పెట్టారు అని టాక్ ఉంది. అయితే భారత సంతతికి చెందిన రాచిన్ తండ్రి అసలు విషయాన్నీ చెప్పుకొచ్చారు.
Advertisement
రాచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రాచిన్ పుట్టినప్పుడు, నా భార్య పేరును సూచించింది మరియు మేము దాని గురించి చర్చించడానికి ఎక్కువ సమయం కేటాయించలేదు. పేరు బాగానే ఉంది, ఉచ్చరించడం సులభం మరియు చిన్నదిగా కూడా ఉండడంతో అదే పెట్టాలని నిర్ణయించుకున్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పేరు రాహుల్ మరియు సచిన్ పేర్ల కలయిక అని మేము గ్రహించాము. మా బిడ్డను క్రికెటర్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో లేదా అలాంటిదేదైనా ఆలోచనతో అతనికి పేరు పెట్టలేదు.
Advertisement
నిజానికి రాహుల్ మరియు సచిన్‌ల పేర్లతో తనకు పేరు పెట్టినట్లు రాచిన్ ఇంతకుముందు చెప్పుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమ్మ, నాన్న పేరు నిర్ణయించే టైం లో వారు రాహుల్, సచిన్ లకు పెద్ద అభిమానులు. రాహుల్ నుండి “రా” మరియు సచిన్ నుండి “చిన్” ను కలుపుకుని రాచిన్ అని పేరు పెట్టారు. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు, ఇద్దరి పేర్ల నుంచి నా పేరు పెట్టడం అదృష్టం అంటూ గతంలో చెప్పుకున్నాడు. ఇదే విషయాన్ని రాచిన్ తాత బాలకృష్ణ అడిగా కూడా ధృవీకరించారు. “నా కుమార్తె మరియు అల్లుడు రాహుల్ ద్రవిడ్ మరియు సచిన్ టెండూల్కర్‌లకు పెద్ద అభిమానులు, కాబట్టి వారు కొత్త పేరును రచిన్ అని పెట్టారు మరియు వారి కొడుకు అని పేరు పెట్టారు.” అని చెప్పారు.
Read More:
శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో ఈ పనులు అస్సలు చేయరాదు.. ఇందులో 5 చాలా ఇంపార్టెంట్..!!
చంద్రమోహన్ కూతురు కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్.. ఎవరంటే..?