Advertisement
ఐసీసీ ప్రపంచ కప్ 2023 లో భారత్ పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో నరేంద్రమోడీ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియాతో ఫైనల్స్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే.. ఇప్పటివరకు భారత్ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఫైనల్స్ లో మాత్రం ఓడిపోయింది. అయితే.. ఇండియన్ జట్టు ఆటతీరుపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఆస్ట్రేలియా టీం అయితే ఫుల్ జోష్ లో ఉంది.
Advertisement
వరల్డ్ కప్ ను వరుసగా ఆరవసారి గెలుచుకున్న దేశంగా చరిత్రలో నిలిచింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం ఆ జట్టు ఆటగాళ్లు పార్టీ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. అయితే.. ఈ ఫోటోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కప్పు గెలిచాక ఆసీస్ జట్టు తమ బుద్ధి చూపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2006 లో కూడా ఆసీస్ జట్టు కప్ గెలిచింది. ఆ ఏడాది కప్ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో ఆసీస్ అమర్యాద ప్రవర్తనా తీరు గుర్తుండే ఉంటుంది.
Advertisement
తాజాగా.. వరల్డ్ కప్ ట్రోఫీ పై కాళ్ళు పెట్టి కూర్చుని బీర్ తాగుతూ ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. 2011 లో టీం ఇండియా గెలిచినప్పుడు.. అప్పటి జట్టు పంచుకున్న ఫోటోలను ఇప్పుడు నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీకి ఎంత గౌరవం ఇస్తున్నామో చూసి నేర్చుకోవాలని అంటున్నారు. అసలు వరల్డ్ కప్ ఆడడానికి మీరు అర్హులు కాదని, ఐసీసీ క్రికెట్ ఆస్ట్రేలియా పై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులకే ఆల్ అవుట్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించేసారు.
Read More:
రాహుల్ ద్రావిడ్ పై తొలి వేటు? ఇకపై కోచ్ గా ఉంటారా.. ఉండరా?
Sathi Gaani Rendu Ekaralu OTT Release Date and Platform, Cast
CSI Sanatan OTT Release Date: When And Where To Watch CSI Sanatan Movie